మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్.. సినీ పరిశ్రమపై ఏపి రాజకీయాలపై ఘాటుగా స్పందించారు. దాంతో ఏపిలో రాజకీయ ప్రకంపణలు మొదలయ్యాయి.. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పలువురు వైసీపీ నేతలు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నటుడు పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయన వ్యక్తి గత జీవితంపై కూడా ఆరోపణలు చేశారు. దాంతో ఆయనపై ట్రోలింగ్ మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో మరుసటి రోజు పోసాని ప్రెస్ మీట్ పెట్టి తన కుటుంబ సభ్యులపై అసభ్య పదాలు వాడుతూ కామెంట్స్ చేశారని.. తనను చంపుతా అని బెదిరిస్తున్నారని.. పవన్ ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ సైకో.. ఆడవారిని గౌరవించని వ్యక్తి అని ఇలా నోటికి వచ్చిన బూతులు తిట్టాడు. తాజాగా అమీర్ పేట లోని ఎల్లారెడ్డి గూడాలో పోసాని కృష్ణ మురళి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.
తన ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని సంజీవరెడ్డి పీఎస్ లో ఫిర్యాదు చేశారు పోసాని. దాడి జరిగిన సమయంలో వాచ్ మెన్ కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా, పోసాని ఇంటిపై రాళ్ల దాడికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.
