పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. అభిమానులు, సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ హాట్ బిగ్‌బాస్ బ్యూటీ మాత్రం అందర్నీ ఆకర్షించేలా ఒంటిపై ఆ ప్రత్యేక భాగంలో పవన్ పేరు పచ్చబొట్టు వేయించుకుని విషెస్ చెబుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ సుపరిచితమైన హాట్ బ్యూటీ ఈమె. నితిన్ సినిమా చల్ మోహన్ రంగాతో పాటు ఏవమ్ వంటి సినిమాల్లో, టీవీ షోల్లో నటించిన ఈమెకు పాపులారిటీ ఎక్కువగా వచ్చింది మాత్రం బిగ్‌బాస్ షోతోనే. ఆ తరువాత ఆర్జీవీతో ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు మరోసారి అషు రెడ్డి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె విషెస్ అందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. పవన్‌పై ఆమెకు ఏ స్థాయిలో అభిమానం ఉందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. అభిమానం పీక్స్‌కు చేరితే ఇలానే ఉంటుందేమో అంటున్నారు నెటిజన్లు. ఇంకొందరు మాత్రం మరీ ఇంతలా తెగించాలా అంటున్నారు.
అషు రెడ్డి ఏం చేసింది
పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని అషు రెడ్డి ఇప్పటికే చాలా సందర్భాల్లో బయటపెట్టింది. ఆ అభిమానం ఎంతంటే అతని పేరుని తన ఒంటిపై పచ్చబొట్టు వేయించుకుంది. ఇందులో విశేషమేముందనుకుంటున్నారేమో.. ఆ పచ్చబొట్టు వేయించుకుంది ప్రైవేట్ పార్ట్‌పై. బయటకు ఎక్స్పోజ్ కాని భాగంపై వేయించుకుంది. ఆమె ఎద పక్క భాగంలో వేయించుకున్న పచ్చబొట్టు కన్పించేలా ఫోటో తీసి పవన్ కళ్యాణ్‌కు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పచ్చబొట్టు ఎక్కడ వేయించుకున్నానో ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్‌కు చెప్పగా ఆయన సిగ్గుపడ్డారని కూడా పేర్కొంది.
నువ్వు పుట్టిన ఈ భూమిపై నేను జన్మించడం గర్వంగా ఫీలవుతున్నాను. ప్రజల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని అషు రెడ్డి ఈ ఫోటో కింద రాసుకొచ్చింది. అందుకే అషు రెడ్డి ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. కొందరైతే ఈ టాటూ వేసిన ఆర్టిస్ట్ అంత అదృష్టవంతుడు మరొకడు లేడంటున్నారు.