మెగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ పరిశ్రమలో టాప్ హీరోగా దూసుకెళ్తున్నారు.ఇటీవల విడుదలైన RRR సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. హీరోగానే కాక, సేవ కార్యక్రమాలలోనూ రామ్ చరణ్ ముందుంటారు. ఇబ్బందుల్లో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్న సంగతి అందరికి తెలిసింది. రామ్ చరణ్ మంచి మనసు గురించి సినీ ప్రముఖులు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు. తాజాగా నటుడు కాదంబరి కిరణ్.. రామ్ చరణ్ గొప్ప మనసు గురించి ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
“మనకు తెలిసి రామ్ చరణ్ మన మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో. కానీ నేను తెలుసుకున్నా..ఆయన అంతకంటే పెద్ద మనసున్న మనిషి. భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే ఖర్చులకు సుకుమార్ అన్న చొరవతో రామ్ చరణ్ ని సాయం అడిగి 2లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేశాను. అవి కాక సుక్కన్న, మనం సైతం, విజయ్ అన్న, రాము తదితరుల వద్ద లక్షా ఇరవై వేల రూపాయలు పోగుచేసి చనిపోయినామె నెలల పాప పేరున FD చేయమని ఇచ్చాం. ఇప్పుడు..ఇన్నిరోజుల తర్వాత నేను ఎదురుపడితే రామ్ చరణ్ “ఆపాప ఎలా వుంది కాదంబరి గారూ?” అని అడిగారు.
అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది.బంగారు చెంచాతో పుట్టడం వేరు, బంగారు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు.” అంటూ కాదంబరి కిరణ్ ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇక ఇది చూసిన మెగా అభిమానులు రామ్ చరణ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మా అన్న గోల్డు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి.. రామ్ చరణ్ చేస్తున్న సేవ కార్యక్రమాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మనకు తెలిసి రామ్ చరణ్ మన మెగాస్టార్ తనయుడు, స్టార్ హీరో నేను తెలుసుకున్నా..ఆయన అంతకంటే పెద్ద మనసున్న మనిషని భక్తి , ప్రేమ, గౌరవం..ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే pic.twitter.com/tjB9gTv66u
— Manam Saitham kadambari kiran (@manamsaitham) April 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.