రామ్ చరణ్ ఉపాసన దంపతులు క్లీంకారాకు జన్మనివ్వడంతో పేరెంట్స్ క్లబ్ లోకి చేరిపోయారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతూ విలువైన బహుమతులను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 11 సంవత్సరాల తర్వాత కుమార్తె జన్మంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో సంతోషాలజల్లు కురుస్తొంది, పెళ్లైన 11 ఏళ్లకి మెగా వారసురాలు అడుగుపెట్టడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక చిన్నారి బారసాల వేడుక ఎంతో ఘనంగా జరిగింది. చిన్నారి పాపకు ‘క్లీంకారా కొనిదెల’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు చిన్నారికి వివిధ కానుకలు ఇస్తూ సర్పైజ్ చేశారు. ఈ క్రమంలోనే శర్వానంద్, ఎన్టీఆర్ వంటి హీరోలందరు చిన్నారి కోసం గోల్డ్ గిప్ట్ పంపిచారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తన కోడలికి ఎవ్వరూ ఇవ్వని విధంగా క్లీంకారా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తొంది. అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ చూసి రామ్ చరణ్, ఉపాసన ఫిదా అయ్యారట. ఇప్పుడు ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకి బన్నీ తన కోడలు కోసం ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా?
తన కోడలు క్లీంకారా కోసం బంగారు పలక బహుమతిగా ఇచ్చారట బన్నీ. ఆ పలక రాసుకునేది కాదు. చిన్నారి పేరు, ఆమె పుట్టిన తేదీ వివరాలు వచ్చేలా పలకపై బంగారు అక్షరాలతో డిజైన్ చేయించారట. దీంతో.. ఐకాన్ స్టార్ ఏది చేసిన ట్రెండీగానే ఉంటుందని, అందుకే స్టైలిష్ స్టార్‌గా పేరుతెచ్చుకుని, ఐకాన్ స్టార్ గా ఎదిగిపోయారంటు.. బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక తమ సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. మొదటి బాగం సూపర్ హిట్ అవ్వడంతో రెండో బాగాన్ని అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఈ మూవీ పైన భారీ అంచానాలు ఉన్నాయి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే శంకర్‌తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమచారం. రానున్న రోజుల్లో ఎక్కవ మెగా సినిమాలు ఉండడంతో మెగా అభిమానులకి మెగా ఫెస్టివల్ అని చెప్పొచ్చు.