ఆధునిక జీవనశైలి కారణంగా చాలా రకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టడమే కాకుండా కొన్ని అలవాట్లు మార్చుకుంటే చాలా సమస్యలకు చెక్ చెప్పవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
బిజీగా ఉండే యాంత్రికమైన జీవితానికి అలవడటంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, కిడ్నీ, బీపీ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. మీరు తినే ఆహార పదార్ధాలే ఈ సమస్యలకు సగం కారణం. అందుకే చాలా మంది గ్రీన్ టీ తాగుతుంటారు. గ్రీన్ టీని ఎక్కువగా వెయిట్ కంట్రోల్‌లో భాగంగా తీసుకుంటుంటారు. కొంతమంది డీటాక్స్ డ్రింక్‌గా సేవిస్తుంటారు. ఇప్పుడు కొత్తగా గ్రీన్ కాఫీ ట్రెండ్ అవుతోంది. గ్రీన్ టీతో పోలిస్తే ఇది మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఫిట్‌నెస్ కోసం గ్రీన్ కాఫీ తాగడం ఇప్పుడిప్పుడే అలవాటవుతోంది.
గ్రీన్ కాఫీ ఎందుకు మంచిది
సాధారణ కాఫీ కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఫిట్‌నెస్, డీటాక్స్ కోసం ఉపయోగపడుతుంది. ఉదయం వేళ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరాన్ని పూర్తిగా క్లీన్ చేసి విష పదార్ధాలను తొలగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల స్కిన్ అండ్ హెయర్ కేర్‌లో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. స్వెల్లింగ్ సమస్యను పోగొడుతుంది. ఇందులో ఉండే క్లోరోజెనిక్ మూలకం కారణంగా మెటబోలిజం పెరిగి కేలరీలు వేగంగా కరుగుతాయి. దాంతో బరువు సులభంగా తగ్గుతుంది.
డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు గ్రీన్ కాఫీ చాలా మంచిది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు రిలాక్సేషన్ ఇస్తుంది.