ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన కొణిదెల సింగిల్ మదర్స్ కు అండగా నిలిచారు. వారి పిల్లలకు ఉచితంగా వైద్యం అందించేందుకు నిర్ణయించారు. దీంతో ఆ తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రల క్లబ్ లో చేరారు. మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది ఉపాసన కొణిదెల. ఈ క్రమంలో మరోసారి గొప్ప మనసు చాటుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల అపోలో ఆస్పత్రిలో అలాంటి పిల్లలకు ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. పేదలు తమ పిల్లలకు జబ్బు చేస్తే తల్లడిల్లిపోతారు. అలాంటి వారిని ఆదుకోవడం మా బాధ్యత అని అన్నారు. జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించేందుకు అపోలో ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న అపోలో చిల్డ్రన్ బ్రాండ్ ను ఉపాసన ప్రారంభించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సింగిల్ మదర్స్ కు శుభవార్తను అందించారు. ఇక నుంచి వీకెండ్ లలో సింగిల్స్ మదర్స్ తమ పిల్లలకు అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం పొందొచ్చని వెల్లడించారు. పిల్లలు అనారోగ్యానికి గురైతే పేరెంట్స్ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతరు. అలాంటి వారి కష్టాన్ని తీర్చి వారి పిల్లలకు మెరుగైన వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే తమ బాధ్యత అని ఉపాసన తెలిపింది. ఉపాసన మాట్లాడుతూ.. నేను తల్లి కాబోతున్నట్లు తెలిసిన తర్వాత ప్రతిఒక్కరు తనపై ప్రేమ కురిపించి, ఆశ్వీర్వదించారని వారందరికి ధన్యవాదాలు తెలిపారు.