టిక్ టాక్.. ఈ వీడియో కంటెంట్ యాప్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అనూహ్యంగా మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన టిక్ టాక్ అంతే ఆశ్చర్యంగా మార్కెట్ మొత్తాన్ని తనవైపుకి లాగేసుకుంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్నీ వర్గాల ప్రజలు యాప్ కి అడిక్ట్ అయిపోయి వీడియో కంటెంట్ క్రియేట్ చేయడంలో బిజీ అయిపోయారు. కానీ.., ప్రత్యేక పరిస్థితిల నడుమ ఇండియన్ గవర్నమెంట్ టిక్ టాక్ యాప్ ని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే.., ఇప్పుడు మళ్ళీ ఇండియాలో టిక్ టాక్ రాబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
టిక్ టాక్ ని తయారు చేసింది బైట్‌డ్యాన్స్ అనే సంస్థ. ఇప్పుడు ఆ కంపెనీ ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్‌కు సంబంధించిన ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో పాటు.., అల్గారిథం అమ్మకానికి కూడా సిద్ధమైంది. అమ్మకపు ఆఫర్ ప్రకటించిన దేశాల్లో భారత్ పేరును సైతం చేర్చింది. ఆసక్తి ఉన్న కంపెనీలు తమ టెక్నాలజీని కొనుగొలు చేయాలని పిలుపు ఇచ్చింది. ఈ మేరకు బైట్ఫ్లస్ డివిజన్ అమ్మకం వ్యవహారాలను చూసుకుంటుందని పేర్కొంది.
టిక్‌టాక్ అల్గారిథమ్ ఏ దేశస్థుల దగ్గర ఉంటే.. టిక్ టాక్ ఆ దేశపు యాప్ అవుతుంది. మన దగ్గర టిక్ టాక్ మీద ప్రత్యేకించి నిషేధం లేదు. కేవలం చైనా యాప్ మాత్రమే కాబట్టి నిషేధించారు. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా టిక్ టాక్ ని సొంతం చేసుకుంటే టిక్ టాక్ మళ్ళీ అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
టిక్ టాక్ ని దక్కించుకోవడానికి భారత్ నుండి చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే వీడియో కంటెంట్‌తో అలరిస్తున్న ఓ యాప్, షార్ట్ న్యూస్‌లు అందించే ఒక యాప్ కంపెనీ, ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్, ఓ ఫుడ్ అవుట్లెట్, ఆన్లైన్లో సరుకులు రవాణా చేసే ఓ యాప్.. ఇలా పది నుండి పన్నెండు కంపెనీలు టిక్ టాక్ కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో ఏ డీల్ ఓకే అయినా.., టిక్ టాక్ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడం గ్యారంటీ. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.