నిత్యం అనేక ప్రమాదాలు చోటు చేసుకున్ని ఎందరో ప్రాణాలు కొల్పోతున్నారు. మరికొందరు తీవ్రం గాయాపడి జీవితాంతం నరకం అనుభవిస్తుంటారు. అయితే ఈ ప్రమాదాలకు ఇతర కారణాలతో పాటు మానవ తప్పిదాలు కూడా ఉంటాయి. మరి ముఖ్యంగా అగ్నిప్రమాదాలు ఈ మధ్యకాలంలో తరచు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. ఆ ఘటన మరువక ముందే హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్థానికులు అప్రమత్తంగా కావడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని మోతీ నగర్ లో దీపావళి వేడుకల్లో పెను ప్రమాదం తప్పింది. దీపావళి పండగ సందర్భంగా పటాసులు కాలుస్తుండగా ఓ అపార్ట్ మెంట్ పై ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న సెల్ టవర్ వైపు కూడా మంటలు వ్యాపించాయి. కొద్దిసేపటికి సెల్ టవర్ వద్ద కూడా మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో అపార్ట్ మెంట్ వాసులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుతుందోనని తెలియక స్థానికులు హడలెత్తి పోయారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొంత ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదనికి గల కారణాలను అధికారులు స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు.