సాధారణంగా యువతీ యువకులు తమకు కాబోయే భర్త గానీ, భార్య గానీ ఇలా ఉండాలంటూ కలలు కనడం సహజమే. అయితే కొందరు కన్న కలలు నిజమౌతాయి.. మరి కొందరివి కల్లలుగానే మిగిలి పోతాయి. కానీ వివాహం తర్వాత ఆమెలోగానీ, అతడిలోగానీ మార్పు వస్తే ఏం చేస్తారు.. కొందరైతే సర్ధుకుపోతారు. మరి కొందరు గొడవలు పెట్టుకుంటారు.. అంతేగా! కానీ ఇతడు మాత్రం పెళ్లి అయ్యాక తన భార్య లావు అయ్యింది అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలోని మీరట్ లోని జకిర్ కాలనీకి చెందిన నజ్మా-సల్మాన్ లు భార్యా భర్తలు. 8ఏళ్ల క్రితం వారికి వివాహం అయ్యింది. ప్రస్తుతం వారికి 7ఏళ్ల వయసున్న కొడుకు సైతం ఉన్నాడు. అయితే ఏంటి సంతోషమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే నజ్మా పెళ్లి తర్వాత బరువు పెరిగింది, అది సహజమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆమె బరువు పెరగడం భర్త సల్మాన్ కు ఇష్టం లేదు. దీంతో రోజూ వారికి గొడవలు జరుగుతూ ఉండేవి.

నువ్వు లావై పోయావు.. నీలా ఎవరూ ఉండరు అంటూ తిడుతూ ఉండేవాడని నజ్మా చెప్పుతూ వాపోయింది. అదీ కాక నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. నేను బరువు పెరిగానని నాతో ఉండటం ఇష్టం లేదని ఏకంగా విడాకులు కోరుతూ కోర్టులో పిటీషన్ వేశాడు సల్మాన్. ఆమెకు కోర్టు నుంచి పత్రాలు రావడంతో తనకు సల్మాన్ తోనే జీవించాలని ఉందని నాకు విడాకులు అక్కర్లేదని కోరుతూ నజ్మా లిసారి గేట్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. అయితే పోలీసులు మాత్రం మాకు ఎలాంటి సమాచారం లేదని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ విషయంపై మాకు ఫిర్యాదు అందితే మేం విచారణ చేపడుతాం అని స్థానిక సీఐ అరవింద్ చౌరాసియా తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన స్థానికులు ముక్కున వేలుసుకుంటున్నారు. మరి బరువు పెరిగితే విడాకులు ఇవ్వడం ఏంటనీ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. సల్మాన్ విడాకులు కోరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
