ఈ మధ్య మహిళలు ఎలా తయారువుతున్నారో గుర్తు చేసుకుంటేనే వెన్నులో వణుకుపుడుతుంది. తమ క్షణిక సుఖం కోసం వివాహేతర సంబంధాలకు వెంపర్లాడుతూ అడ్డొచ్చిన భర్తను సైతం హత్య చేసేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓ మహిళ కట్టుకున్న భర్తను తాళ్లతో మంచానికి కట్టేసి అనంతరం అతని నోట్లో పురుగుల మందు పోసి ఇంట్లో నుంచి పరారైంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మనవపాడు మండలం కొర్విపాడులో జయరాముడు, శాంతి అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 15 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య ఏదో విషయంలో గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ నెల 22వ తేదీన దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. భర్త పడుకున్నాక వెంటనే నిద్రలేచిన భార్య భారతి నిద్రిస్తున్న భర్తను మంచానికి తాళ్లతో కట్టేసింది.

అనంతరం సిరంజితో భర్తతో నోట్లో పరుగుల మందు పోసి అక్కడి నుంచి పరారైంది. దీనిపై స్పందించిన జయరాముడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే భార్య భారతి మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
