దేశంలో దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా మృగాలుగా మారి బరితెగించి ప్రవర్తిస్తూ అత్యాచార దాడులకు ఒడిగడుతున్నారు. అడ్డొచ్చిన చెల్లిని, అత్తని, మైనర్ బాలికను ఇలా వావివరసలు మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణాల నిర్మాలనకు ప్రభుత్వాలు, నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా అస్సలు కూడా లెక్కచేయటం లేదు. ఇదిలా ఉంటే ఆడుకుంటున్న ఓ చిన్నారిపై అత్యాచారం చేశాడో వృద్ధుడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..చిత్తూరు జిల్లా తవణంపల్లె గ్రామానికి చెందిన ఉమాపతి(70) ఏళ్ల అనే వృద్దుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే భార్య మృతి చెందడంతో ఉమాపతి ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ ఎనిమిదేళ్ల బాలికపై ఈ దుర్మార్గుడి కన్ను పడింది. దీంతో ఎలాగైన ఆ బాలికపై దాడి చేయాలనే విషపు ఆలోచలను నింపుకున్నాడు. ఇక సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.

ఇది కూడా చదవండి: Rajasthan: ప్రియుడితో కలిసేందుకు అడ్డొస్తున్న భర్త.. గొడ్డలితో నరికి చంపిన భార్య!
గురువారం సాయంత్ర ఆ బాలిక ఓ చోట ఆడుకుంటూ ఉంది. ఇది కనిపెట్టిన ఉమాపతి ఆ చిన్నారిని నిర్మాణంలో ఉన్న సచివాలయంలోకి లాక్కెళ్లాడు. అనంతరం ఆ బాలికను తాకరాని చోట తాకి దారుణంగా అత్యాచారం చేశాడు. ఇక బాలిక అరుపులు విన్న ఆ బాలిక తల్లి పరుగు పరుగున వచ్చింది. దీంతో తల్లి రాకను గమనించిన ఉమాపతి అక్కడి నుంచి బాలికను వదిలి పరారయ్యాడు. ఇక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
