బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 తేదీ దగ్గర పడే కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. ఎందుకంటే సెలెబ్రిటీలు ఎవరనేది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక్కొక్క పేరు బయటకు వస్తోందంతే. ఇప్పుడు మరో సెలెబ్రిటీ పేరు విన్పిస్తోంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మరి కొద్దిరోజుల్లోనే లాంచ్ కానుంది. సెలెబ్రిటీల పేర్లు దాదాపు ఖరారైనా అధికారికంగా ప్రకటించలేదు. దీనికితోడు బిగ్‌బాస్ యాజమాన్యం ప్రస్తుతం సామాన్య కంటెస్టెంట్ల ఎంపికలో బిజీగా ఉంది. ఈసారి ఏకంగా 5 మంది సామాన్యులు బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఐదుగురి కోసం వచ్చిన వందలాది అప్లికేషన్లను స్క్రీనింగ్ చేసి 40 మందిని ఎంపిక చేశారు. అందులోంచి తిరిగి టాప్ 15 ఫైనల్ చేశారు. ఈ 15 మందిలో ఐదుగురిని ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఫైనల్ చేస్తారు. ఈ 15 మందిని ఎంపిక చేసేందుకు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో మూడు వారాలుగా ప్రక్రియ నడిపింది.
ఇప్పుడిక సెలెబ్రిటీలు ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటితం కాలేదు. సోషల్ మీడియాలో అడపా దడపా ఒక్కొక్కరి పేరు విన్పిస్తోంది. అదే విధంగా ఇప్పుడు వివాదాస్పద కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ పేరు విన్పిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫిర్ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన ఈమె..అతనిపై ఆరోపణలు చేయడంతో సంచలనమైంది. ఈమె ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ వివాదం తరువాత శ్రష్ణి వర్మకు కొరియోగ్రాఫర్ అవకాశాలు కూడా వస్తున్నాయి.
బిగ్‌బాస్ హౌస్‌లో శ్రష్ణి వర్మ ?
అయితే ఇప్పుడు బిగ్‌బాస్ టీమ్ ఈమెను కలిసినట్టు తెలుస్తోంది. దీనికి శ్రష్ణి వర్మ కూడా అంగీకారం తెలిపిందట. ఈ వార్త కేవలం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. నిజంగా ఈమె ఎంటరైతే మాత్రం బిగ్‌బాస్ హౌస్‌లో రచ్చ మామూలుగా ఉండకపోవచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రష్ణి వర్మను ఢీ డ్యాన్స్ షోలో గుర్తించిన కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ ఆమెకు తన వద్ద అసిస్టెంట్‌గా అవకాశమిచ్చాడు. ఆ తరువాత ఏమైందో గానీ కొన్నాళ్లకు తనని జానీమాస్టర్ లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేయడంతో ఇండస్ట్రీలో ఈ అంశం అత్యంత చర్చనీయాంశమైంది. కొందరు కుట్ర చేసి జానీమాస్టర్‌ని ఇరికించారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో శ్రష్ణి వర్మ అడుగు పెడుతుందో లేదో మరి చూడాలి.