రాయలసీమ ప్రాంత స్వర్ణ భవిష్యత్తు కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అడుగు వేసింది. రాయలసీమను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూ.1 లక్ష కోట్ల అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇవాళ అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని బీకే పల్లిలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ భారీ ప్రాజెక్టులతో పాటు ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రిలెక్చర్’ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చేందుకు ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రిలెక్చర్’ను ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇది అగ్రికల్చర్ లీడర్‌షిప్, ఇన్నోవేషన్, ట్రేడ్ కోసం ఒక ఉత్తమ అంతర్జాతీయ కేంద్రంగా పనిచేస్తుంది. రాష్ట్రంలోని 10 జిల్లాలలో విస్తరించి ఉన్న 201 క్లస్టర్లలో ఈ అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తున్నారు. 2029 జులై నాటికి అదనంగా 6 లక్షల హెక్టార్లలో ఉద్యాన సాగును పెంచడం ద్వారా మొత్తం 14.41 లక్షల హెక్టార్లలో హార్టికల్చర్ సాగు విస్తరించాలనేది ప్రభుత్వ బిగ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

ఈ బృహత్తర ప్రాజెక్ట్ ద్వారా సుమారు 9.6 లక్షల మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మార్కెట్లకు పంట రవాణా సులభతరం చేసేందుకు పల్లెల్లో 5,721 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. కనెక్టివిటీ మెరుగుపడటం వల్ల రైతులకు తమ పంటకు మంచి మద్దతు ధర లభించడమే కాకుండా, రవాణా ఖర్చులు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.
సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు వివిధ నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరాను క్రమబద్ధీకరిస్తున్నారు. ఇందులో భాగంగా 9 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధితో పాటు, 4.3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ సాగునీటి సౌకర్యాల వల్ల రాయలసీమ వ్యాప్తంగా ఉన్న వర్షాధార భూములు పచ్చని ఉద్యానవనాలుగా మారనున్నా
