ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యార్థులకు చక్కటీ విద్యనంధించడానికి ఎన్నో స్కీమ్స్ అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే అమ్మఒడి కింద తల్లులకు ప్రతియేట రూ.15 వేల ఖాతాల్లో జమ చేస్తున్న విసయం తెలిసిందే. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలని మార్పులు.. చేర్పులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రం సందర్భంగా ఇచ్చిన హామీలు పూర్తిచేసే పనిలో నిమగ్నం అయ్యారు. ముఖ్యంగా విద్యాశాఖపై ఆయన ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకాల్లో జగనన్న ‘అమ్మఒడి పథకం’ ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయల చొప్పను తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి విద్యార్థులకు ప్రతి నెలా ఇస్తున్న కాస్మోటిక్ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, వసతీ గృహాలు, కేజీబీవీలతో పాటు మోడల్ స్కూల్స్ లో విద్యార్థులకు యూనిఫీమ్ రేట్లు కూడా ఫిక్స్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ప్రతి నెల 3 వ తరగతి నుంచి 6 వ తరగతి వరకు చదివే విద్యార్తులకు అంటే బాలురకురూ.125, బాలికలకు రూ.130 చొప్పున కాస్మొటిక్ చార్జీలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇక 7వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో బాలురకు రూ.150, బాలికలకు రూ.200, ఇంటర్ చదువుతున్న బాలురకు రూ.200, బాలికలకు రూ.250 చొప్పున ఛార్జీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏళ్ల తరగబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో సమూల మార్పులు తీసుకు వచ్చేందుకు తాను కృషి చేస్తున్నానని అన్నారు సీఎం. మన పిల్లలు హాస్టల్స్ లో ఉంటే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో.. అదే స్థాయిలో నిర్వాహన ఉండాలని సీఎం అభిప్రాయ పడ్డారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హెయిర్ కటింగ్ చార్జీ రూ.50 పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డైట్ ఛార్జీల్లో కూడా మార్పులు చేస్తూ 3,4 తరగతి విద్యార్థులకు రూ.10050, 5 నుంచి పదవ తరగతి చదవివే విద్యార్థులకు రూ.1,400 గా నిర్ణయం తీసుకుంది. ఆ పై తరగతుల విద్యార్థులకు రూ.1600 డైట్ చార్జీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు చక్కగా చదువుకోవాలి.. ఇంటి వాతావరణం మర్చిపోయే విధంగా ప్రభుత్వ హాస్టల్స్ లో అన్ని సౌకర్యాలు ఉండాలి.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.