ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల మద్దతు కోసం ఇప్పటి నుంచి పలు రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత వైఎస్ జగన్ ప్రజల కోసం పలు రకాల పథకాలు అందిస్తోంది. ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాల్లో అమలు పరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కార్మికులు, మహిళలల ఆర్థికావసరాల కోసం వివిధ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. ఒక్కో వర్గానికి ఒక్కో స్కీమ్ చొప్పున ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది జగన్ సర్కార్. ఈ పథకాల ద్వారా ఇప్పటికే చాలామంది లబ్ధి పొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఏపీ సర్కార్ అమలు పరుస్తున్న పథకాల్లో ఒకటి వాహన మిత్ర. తాజాగా వాహనమిత్ర లబ్దిదారులకు జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వైఎస్సాఆర్ వాహనమిత్ర స్కీమ్ లో భాగంగా ఈ నెల 31న ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.10 వేల చొప్పన జమ చేస్తున్నట్లు వెల్లడించింది. కొత్తగా దరఖాస్తుకు నేటితో గడువు పూర్తి అవుతుంది. ఎల్లుండి వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. అయితే ఈసారి కొత్తగా రేషన్ సరఫరా చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (MDU) ఆపరేటర్లకు కూడా నగదు చెల్లించనుంది. గత ఏడాది 2.61 లక్షల మందికి లబ్ధి చేకూరగా… ఈ ఏడాది సంఖ్య భారీగా పెరిగింది.
ప్రతి సంవత్సరం ఈ పథకంలో చేరిన లబ్దిదారులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ డబ్బులు లబ్దిదారుల అకౌంట్ లోకి నేరుగా జమ అవుతాయి. వాహనాల నిర్వహాణ, ఫిట్ నెస్ సర్టిఫికెట్స్, ఇన్స్‌రెన్స్, తదితర ఖర్చుల కోసం ప్రతిఏటా ఈ ఆర్థిక సాయం అందిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఆ ఆర్థిక సాయం ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు వర్తిస్తుంది. వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకంలో చేరాలని అనుకునేవారు ఆన్ లైన్ లోనే రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. ఏపీ ట్రాన్స్ పోర్ట్ వెబ్ సైట్ లోకి వెళ్లి https://aptransport.org/ ద్వారా అప్లికేషన్ సెక్షన్‌లోకి వెళ్లి.. అన్ని వివరాలు అందించాలి.