రోబోలు అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది ‘రోబో’ సినిమా. అందులో చిట్టి అనే రోబో మరమనిషే అయినా.. హీరోయిన్ కి సహయం చేసింది. హీరోయిన్ కి చేసినంతగా కాకపోయిన నిజ జీవితంలో కూడా ఆ రోబోలు రెస్టారెంట్లలో సేవలు అందిస్తున్నాయి. ఆ రోబోలు రెస్టారెంట్లలో ఫుడ్ సర్వ్ చేస్తున్న సంగతి మన తెలిసిందే. అయితే తాజాగా అందరిని ఆకట్టుకునేందుకు రోబో చీర కట్టుకొని సేవలు అందింస్తుంది. ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది. శారీలో సేవలు అందింస్తున్న రోబోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ శారీ రోబో విశేషాలేంటో తెలుసుకుందా..
చీరకట్టులో అందరిని ఆకట్టుకుంటున్నా ఈ రోబో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలోని ఓ హోటల్ దర్శనమిచ్చింది. ఈ రోబో పేరు ఎకో. ఇది నిజమైన వెయిటర్లు చేసేంత వేగంగా పని చెయ్యకపోయినా… నెమ్మదిగానైనా కరెక్ట్ గా చేస్తోంది. శారీ ధరించిన ఈ రోబో కస్టమర్లను ఇట్టే ఆకర్షిస్తోంది. శారీతో తమ వద్దకు వచ్చి సేవలు అందిస్తుంటే కస్టమర్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే ఈ రోబోను ఢిల్లీలోని రోబోల తయారీ కంపెనీ నుంచి రూ.2.5 లక్షలకు కొన్నట్లు హోటల్ నిర్వహకులు తెలిపారు. కస్టమర్లు చెప్పిన మాటలను వినడం ద్వారా ఈ రోబో ఆర్డర్లు తీసుకుంటుంది.
మెనూ ఆర్డర్ తీసుకోవడమే కాదు… మైసూరు సిటీలోని సందర్శన ప్రాంతాల వివరాల్ని కూడా కస్టమర్లకు చెప్పగలదు ఈ రోబో. ఆ ప్రాంతాలకు సంబంధిచిన పూర్తి వివరాలను ఈ రోబో తెలియజేస్తుంది. అలా తన చీరకట్టుతో, తన మాటలతో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ రోబో 15 టేబుళ్లకు ఫుడ్ సప్లయ్ చేసే సామర్థ్యం ఉంది. ఫ్యూచర్ లో మరింతగా పెంచే వీలుందని నిర్వహకులు తెలిపారు. ఇలాంటి రోబో రెస్టారెంట్లు ఇండియాలో హైదరాబాద్, చెన్నై, ఏలూరు, కర్ణాటకలోని శివమొగ్గలో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు తొలిసారిగా మైసూరులో కూడా సేవలు మొదలయ్యాయి.
ఈ రోబో ఫుడ్ సప్లయ్ లో ఎటువంటి ఇబ్బంది పడదు. ఎవరైనా అడ్డు వస్తే సెన్సార్లు రోబోను ఆపేస్తాయి. ఈ రోబో వర్కింగ్ గురించి హోటల్ సిబ్బందికి ఆల్రెడీ ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు హోటల్ యాజమానులు. రోబో తయరీ కంపెనీ ఏ డౌట్ వచ్చినా క్లారిటీ ఇస్తూ వారికి సమస్య లేకుండా చేస్తోంది.మరో ఐదు మహిళా రోబోలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు. శారీలో హోటల్ సందడి చేస్తున్న ఆ రోబో వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.