సినిమా ఇండస్ట్రీలో చాలామంది వివిధ రకాల పనులు చేసేందుకు ఇష్టపడుతుంటారు. హీరోలు దర్శకత్వం లేదా నిర్మాణ బాధ్యతలు వహిస్తుంటారు. ఈ క్రమంలో తమిళ హీరో కార్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆ పని మాత్రం చేయనంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..
తమిళ నటుడు కార్తీకు అటు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంత చేరువయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా దురంధర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరో తమిళ హీరో జయం రవి కొత్తగా ప్రారంభించిన రవి మోహన్ స్డూడియోస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రజనీకాంత్ ఇచ్చిన ఓ సలహాను ఈ సందర్భంగా ప్రస్తావించాడు.
కోలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతల సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను తన కెరీర్‌లో కేవలం నటనకే పరిమితమౌతానని చెప్పుకొచ్చాడు. ఎప్పటికీ నిర్మాణ రంగంలో రానని తేల్చి చెప్పాడు. ఈ విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు ఇచ్చిన సలహాను పాటిస్తానన్నాడు. కానీ కార్తి సోదరుడు సూర్య మాత్రం అటు హీరోగా రాణిస్తూనే 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో నిర్మాతగా హిట్ సినిమాలు తీస్తున్నాడు. కార్తి మాత్రం నిర్మాణ బాధ్యతలు చేపట్టనంటున్నాడు.
జయం రవి ఓసారి తనకు చెప్పిన కధ బాగా నచ్చిందని, అందులో నెరేషన్ ఇస్తూ నటించి చూపిండం బాగా ఆకట్టుకుందని గుర్తు చేశాడు. ఆ సినిమాలో తాను జయం రవి హీరోలుగా ఉంటామన్నాడు. కేవలం నటన తప్ప ప్రొడక్షన్ పని చేపట్టనని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు కార్తీ. ఎందుకంటే చాలామంది హీరోగా చేస్తూనే దర్శకత్వం, నిర్మాణం, ఎడిటింగ్ ఇలా వివిధ రకాల పనుల్లో ఆసక్తి చూపిస్తుంటారు. కార్తీ మాత్రం అందుకు వ్యతిరేకమంటున్నాడు.