క్రైమ్ స్టోరీలు తెరకెక్కించడం అంటే మలయాళ దర్శకుల తరువాతే అని చెప్పాలి. చిన్న ఎలిమెంట్‌ను పట్టుకుని కధను అద్భుతంగా మలుస్తారు. అలాంటిదే మరో మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ కంటెంట్ సినిమాలు లేదా వెబ్‌సిరీస్‌లలో మలయాళందే అగ్రస్థానం. ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 21 నుంచి ఈటీవీ విన్‌లో వస్తున్న ఈ సినిమాకు ఐఎండీబీ 8.3 రేటింగ్ ఇచ్చింది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో నటించిన ఈ సినిమా పేరు సూత్రవాక్యం. తెలిసో తెలియకో ప్రతి కుటుంబం ఓ సీక్రెట్ దాచి పెడుతుంటుంది. నిజం బయటపడినప్పుడు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా స్టోరీ లైన్. జూలై 11న ధియేటర్లలో విడుదలైన ఈ సినిమాను యూజీన్ జోస్ చిరమ్మెల్ తెరకెక్కించాడు.
ఫ్యామిలీ డ్రామాగా ప్రారంభమై ఆ తరువాత థ్లిల్లింగ్ ట్విస్ట్ తీసుకుంటుంది. సినిమాకు మంచి రివ్యూలు రావడంతో థియేటర్ రన్ ఫరవాలేదన్పించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది.