రోడ్డు ప్రమాదాలకు కారణం.. అతివేగం.. నిర్లక్ష్యం. అతివేగంతో ఊహించని ప్రమాదాలు జరిగి తీరని నష్టం వాటిల్లుతుంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ద్వారా కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే వీటితోపాటుగా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా సామాన్యుల ప్రాణాలను బలితీసుకుంటుంది.
సాధారణంగా రోడ్లపై ఊహించని ప్రమాదాలు చాలా జరుగుతాయి. దీంతో ఎందరో తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. వారి కుటుంబసభ్యులు రోడ్డున పడుతున్నారు. ప్రమాదాలకు కారణం.. అతివేగం.. నిర్లక్ష్యం. అతివేగంతో ఊహించని ప్రమాదాలు జరిగి తీరని నష్టం వాటిల్లుతుంది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ద్వారా కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే వీటితోపాటుగా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా సామాన్యుల ప్రాణాలను బలితీసుకుంటుంది. రోడ్లపై గుంతలు పూడ్చకుండా అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో నిండు ప్రాణాలు బలిఅవుతున్నాయి. ఇలాంటి ఘటనలు చూసి విసిగిపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన సాలరీ నుండి రెండు లక్షల 70 వేల రూపాయలను, బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడానికి పూనుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్నాటక రాష్ట్రంలో బెంగళూరుకు చెందిన ముద్గల్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతనికి 32 సంవత్సరాల వయస్సు. తాను నివసించే ప్రాంతంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఓ డెలివరీ బాయ్ గుంతల రోడ్డుపై వెళ్తూ అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని కుటుంబం డెలివరీ బాయ్ సంపాదనపై ఆధారపడి ఉంది. ఆరోడ్డుపై ఓ ఆటో కూడా బోల్తాపడింది. అందులోని ఇద్దరు వ్యక్తులు గాయాలయ్యాయి. అయినా అధికారులు స్పందించడం లేదు.
ఈ పరిస్థితుల్లో ముద్గల్ ‘నో డెవలప్‌మెంట్ నో ట్యాక్స్’ పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఈ నూతన ఉద్యమం ప్రారంభించాడు. కనీస వసతలు కల్పించనప్పుడు పన్నులు ఎందుకు కట్టాలి అని ప్రశ్నిస్తున్నాడు ముద్గల్. హోసా ప్రాంతంలో పాడైన రోడ్లను బాగుచేయించుటకు నిధులను సేకరించారు. సేకరించిన నిధులు సరిపోక.. తాను పని చేస్తున్న ఐటీ కంపెనీ నుండి రెండు లక్షల డెభ్బై వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులతో రోడ్లను బాగుచేయుటకు ఉపయోగించాడు. స్థానికులు కూడా అతనికి సహాయం చేశారు. ప్రపంచంలో ఇలాంటి తరహా ఘటన ఇదే కావొచ్చు అంటున్నారు నెటిజన్లు. ప్రభుత్వం పనితీరు, అధికారుల నిర్లక్ష్యం.. ఇలాంటి ప్రజా ప్రతినిధులు ఉన్నంత కాలం రోడ్లు ఇలాగే ఉంటాయని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారులు తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని వాపోతున్నారు. సాఫ్ట్‌వేర్ చేసిన పనికి అందరు హాట్సాఫ్ చెబుతున్నారు.