విశాఖపట్నంలో కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు ఎంతటి సంచలనమైందో అందరికీ తెలిసిందే. ప్రియుడు కోసం అడ్డుగా ఉన్న భర్తను హతమార్చిన వగలాడి భార్య శివాని.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడింది.
విశాఖపట్నంలో కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు ఎంతటి సంచలనమైందో అందరికీ తెలిసిందే. ప్రియుడు కోసం అడ్డుగా ఉన్న భర్తను హతమార్చిన వగలాడి భార్య శివాని.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు కథ బయటకు వచ్చింది. ప్రియుడు రామారావుతో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన శివానీ, భర్త ఆస్తి, ఉద్యోగం కోసం.. అతడితో మద్యం తాగించి, వీడియో తీసి, ఆ తర్వాత దిండుతో అదిమి చంపిన సంగతి విదితమే. ఇప్పుడు ఇదే తరహాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చిందో ఇల్లాలు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసి.. ఆత్మహత్యగా నాటకమాడిందో మహానటి. వివరాల్లోకి వెళితే కడూరు తాలూకా హనుమనహళ్లికి చెందిన పావనికి నవీన్ అనే వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. కాగా, భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి గొడవపెట్టుకోగా.. పెద్దలు రాజీ చేయడంతో కలిసి ఉంటున్నారు. అయితే ప్రియుడ్ని మర్చిపోలేకపోయింది పావని. భర్తను వదిలించుకోవాలని భావించింది. ఇందులో భాగంగా స్కెచ్ వేసింది. చపాతీలో నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది. భర్త వాటిని తిని.. నిద్రలోకి జారిపోగానే.. హత్య చేసి..ఇంటి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో పడేసింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడింది. చిక్కమగళూరు జిల్లా యగటి పోలీసులు రంగంలోకి దిగి విచారించగా.. పావని అసలు విషయం వెల్లడించింది.