హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు నగరంలో పలు కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ విషయంలో పలు ఆంక్షలు విధించారు. పోలీసులు తెలిపిన ఆ రూట్లలో వాహనదారులు వెళ్లకపోవడం మంచిది.
నగరాల్లో ఉండే ప్రధానమైన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. నగరంలో నివాసం ఉండే మనిషి జీవితంలో సగం ట్రాఫిక్ లోనే గడిచిపోతుంది. అయితే ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ప్రభుత్వాలు, అధికారులు అనేక చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్ నగరంలో కూడా ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రజలకు నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు కు సంబంధించిన కీలక సూచనలు చేశారు. రేపు నగరంలోని పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
హైదరాబాద్ పోలీసులు ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతంలో షీ టీమ్స్ 5కే, 2.5కే రన్ నిర్వహిస్తున్నారు. దీని కారణంగా సోమవారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు. వి.వి. విగ్రహం నుంచి ఖైరతాబాద్ వంతెన, నెక్లెస్ రోడ్డు వెళ్లే ట్రాఫిక్ ను వీవీ విగ్రహం వద్ద షాదన్ , సిరంకారి భవన్ వైపు మళ్లించనున్నట్లు తెలిపారు. అలాగే తెలుగు తల్లి ఫ్లైవర్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతిలేదని, ఇక ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఓల్డ్ గేట్ సెక్రటేరియట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ గేట్ సెక్రటేరియట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
అలానే లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్ మలుపు వద్ద మళ్లించనున్నారు. ఇక లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అంబేద్కర్ విగ్రహం వద్ద, ఇక్బాల్ మినార్ మలుపు వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు. కవాడిగూడ క్రాస్ రోడ్ నుండి వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వైపు అనుమతించడం లేదని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఇక కర్బలా మైదాన్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ వద్ద డీబీఆర్ మిల్స్ వైపు మళ్లిస్తారు.
అలానే డీబీఆర్ మిల్స్ నుండి వచ్చే వాహనాలను చిల్డ్రన్ పార్క్ వైపు నిషేధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అలాగే మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రబాద్ స్టేషన్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను నల్లగుట్ట జంక్షన్ వద్ద మళ్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. వాహనదారులు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు కోరారు. మరి.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన ఈ సమచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.