గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ, ప్రతిపక్షాల మద్య రగడ కొనసాగుతుంది. అంతే కాదు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి పడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లెక్కలేదని ఫైర్ అయ్యారు. అందుకే మోడీ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాలేదన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుంది. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీచర్లే లేనప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువును ఎలా అందిస్తారని నిలదీశారు.
తెలంగాణలో సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలలను అన్నింటినీ మూసివేశారని రేవంత్ మండిపడ్డారు. పేదలకు విద్యను దూరం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, చదువును దూరం చేసి గోర్లు- బర్లు- చేపలు ఇస్తున్నారన్నారు రేవంత్. తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయని చిట్ చాట్ లో రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే నియమాకాలను చేపట్టారు.
ఇది చదవండి : అవి వాడొద్దు..! వైద్యులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
పాఠశాలలో కరోనా వచ్చి మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదు. అయినా వాటిని మూసివేశారు. బయట పార్టీలు,- పబ్ ల వల్ల మరణాలు జరుగుతున్నాయి.. అయినా వాటిని నియంత్రణ చేయరు ఎందుకంటే ఆదాయం ఉంటుంది. రైట్ టు ఎడ్యూకేషన్ యాక్ట్ ను తెలంగాణలో అమలు చేస్తేనే పేదలు బాగుపడుతారని రేవంత్ అన్నారు. కేసీఆర్ మనువాది అంటూ విమర్శించారు.