చాలా మంది భోజన ప్రియులు చేపలతో చేసే ఆహార పదార్ధాలు అంటే ఎంతో ఇష్ట పడుతుంటారు. అందుకే తమ భోజనంలో తప్పనిసరిగా చేప కూర ఉండేలాగా చూసుకుంటారు. అయితే మరికొందరు మాత్రం చేప కూరను తినేందుకు భయపడుతుంటారు. కారణం.. వాటిలోని ముల్లులు ఎక్కడ గొంతులో ఇరుక్కుంటాయో అనే భయం. అది కూడా వాస్తవమే.. చేపల కూరను అజాగ్రత్తగా తింటే ముల్లులు గొంతులో ఇరుక్కుంటాయి. అలా జరిగి కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. మరికొందరికి చేప ముల్లులు కడుపులోకి పోవడంతో నరకం అనుభవించిన ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా చేప ముల్లు కారణంగా ఓ వ్యక్తి నాలుగేళ్లు నరకం అనుభవించాడు. చివరకు వైద్యులు ఆపరేషన్ చేసి తీయడంతో ఆ నాలుగేళ్ల నరకం నుంచి బయటపడ్డాడు. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలానికి చెందిన సాయిలు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అతడి నాన్ వేజ్ అంటే కాస్తా ఆసక్తి ఎక్కువగా ఉండేది. అయితే ఆ ఇష్టం కారణంగా నాలుగేళ్లుగా నరకం అనుభవించాడు. నాలుగేళ్ల క్రితం ఇంట్లో చేపల కూరతో భోజనం చేస్తుండగా రెండు అంగుళాల పొడవు గల చేప ముల్లును సాయి మింగేశాడు. అది మొదట గొంతులో ఇరుక్కుపోయింది. ఆ తరువాత బాధితుడు వివిధ ప్రయోగాలు చేయగా కడుపులోకి జారిపోయిందంట. దీంతో అప్పటి నుంచి ఇబ్బంది పడుతూ నరకం అనుభవించాడు. ఆ సమస్య నుంచి బయటపడేందుకు పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు.
రోజులు గడుస్తున్నాయి కానీ ఫలితం లేకపోయింది. అలానే నాలుగేళ్ల పాటు నరకయాతన అనుభవిస్తూ కాలాన్ని వెల్లదీశాడు. అయితే ఇటీవల 15 రోజులుగా భరించలేని కడుపు నొప్పి రావటంతో సాయిలు అల్లాడిపోయాడు. వెంటనే మెదక్ లోని సాయిచంద్ర నర్సింగ్ హోమ్ కి వెళ్లాడు. అక్కడి వైద్యుడు సాయిలను పరీక్షించి ఆపరేషన్ చేయాలని బాధితుడి బంధువులకు చెప్పాడు. అందుకు వారు అంగీకరించడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి సాయిలు కడుపులోని ముల్లును బయటకు తీశాడు. వైద్య వృతిలోనే ఇది అరుదైన అంశంగా పలువురు పేర్కొన్నారు. మరీ.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.