వారిది మన దేశం కాదు.. పని కోసం వచ్చారు.. సొంత బంధువులే సాయం చెయ్యని ఈ సమాజంలో వారిని అయ్యో పాపం అని ఓ కుటుంబం చేరదీసింది. పని కల్పించింది. వారు కొన్ని నెలలు నమ్మకంగానే పని చేశారు. తర్వాత తెలిసింది వారి అసలు రంగు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లోని కుకట్ పల్లిలో దామోదర్ రావు కుటుంబం నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రితం వారి వద్దకు ఓ నేపాలి జంట చక్రధర్, సీత వచ్చారు. పని మనుషులుగా చేరి, ఆ ప్రాంతంలోనే నివాసం ఉండేవారు. వీరికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఈనెల 2న వీరు నాగపూర్ వెళ్లి 10న తిరిగి వస్తు మరో వ్యక్తిని వెంటబెట్టుకొని వచ్చి తమ బంధువుగా చెప్పారు. దామోదర్ రావు కుటుంబంతో కలిసి ఈనెల 12న రాత్రి కొంపల్లిలో ఓ వివాహానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన నేపాలి జంట తలుపును పగలగొట్టి లోపలికి వెళ్లారు. సీసీ కెమెరాలపై దుస్తులు వేసి ఇంట్లో ఉన్న డబ్బు, నగలను చోరీ చేశారు. రాత్రి 11.30 గంటల తర్వాత దామెదర్ రావు ఇంటికి రాగ తలుపులు తెరిచి ఉన్నాయి.
ఇంట్లో ఉన్న నగలు, డబ్బుతో పాటు పని మనుషులు కూడా లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెుత్తం రూ.30 లక్షల నగదు, రూ.25 లక్షల బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు తెలిపారు. పోలీసులు సీసీ టివీ ఆధారంగా వారు లక్డీకపూల్ లో ఆటో దిగినట్లు తెలుపారు. వారి ఫోన్ లు స్వీచ్ ఆఫ్ వస్తుండటంతో ఎటు వెళ్లారో తెలిలేదని పోలీసులు అన్నారు. వారు నేపాల్ పారి పోయారా? లేదా సిటీలోనే ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. వారి కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పరామర్శించారు.