తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కారణంగా ఇప్పటికే పలు ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. తాజాగా కొన్ని నెలల క్రితం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ టీఎస్పీస్పీ సంచలన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కారణంగా ఇప్పటికే కొన్ని పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్పీ ప్రకటించింది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్, మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పరీక్షలు టీఎస్పీస్సీ వాయిదా వేసింది. అలానే జూనియర్ లెక్చరర్ పరీక్షలను వాయిదా వేసింది. ఈక్రమంలోనే తాజాగా గ్రూప్- ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసింది. జూన్ 11న తిరిగి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించున్నారు. అలానే టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ విషయంలో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ప్రవీణ్‌ను స్త్రీలోలుడిగా తేల్చిన పోలీసులు, అతడి రాసలీలల చిట్టాను బయటకు తెచ్చే పనిలో పడ్డారు