విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు, వేసవి సెలవులకు సంబంధించిన విషయాలపై విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది.
సాధారణంగా పాఠశాల విద్యార్ధులు రెండే విషయాలపై ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందులో ఒకటి పరీక్షల గురించి కాగా, మరొకటి వేసవి సెలవుల గురించి. విద్యా సంవత్సరం చివరకి వచ్చేస్తే చాలు..వారి మెదళ్లలో వీటి గురించే ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడెప్పుడు వేసవి సెలవుల తేదీలు ప్రకటిస్తారా? అని ఎదురు చూస్తుంటారు. సమ్మర్ లోఎంజాయ్ చేసేందుకు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.ఈ నేపథ్యంలోనే విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి కాలం సెలవులు ఎప్పటి నుంచి అనే విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఇక పూర్తి వివరాల్లకో వెళ్తే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులపై కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హాలిడేస్ ఉండనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇదే సమయంలో సమ్మేటివ్ అసెస్ మెంట్-2 పరీక్ష తేదీల్లో కీలక మార్పులు చేసింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరగనున్న ఈ ఎస్ఏ-2 పరీక్షల తేదీల్లో మార్పులుచ చేసింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. రెండు రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్ 12 నుంచి ప్రారంభంకానున్నాయి. పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలోనే ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. అదే విధంగా ఒంటిపూట బడుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా.. మార్చి రెండో వారం నుంచి రాష్ట్ర పాఠశాలల్లోని విద్యార్ధులకు ఒంటి పూట తరగతులు నడపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎస్ఏ-2 పరీక్షల షెడ్యూల విషయానికి వస్తే.. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు జరుగుతాయి. అలానే 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 20 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.
ఇక పరీక్షల అనంతరం ఏప్రిల్ 21న ఫలితాలను వెల్లడించి, ఏప్రిల్ 24న అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలన్నీ తిరిగి జూన్ 12న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చాయి. మరి.. తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.