ఈ మద్య కాలంలో వివాహాలు చాలా వెరైటీ పద్దతుల్లో జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ నుంచి మొదలు పెడితో వెడ్డింగ్ వరకు వినూత్న పద్దతుల్లో చేసుకుంటున్నారు. కొన్ని తెగలవారి పెళ్లి విషయంలో ఆచార వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటాయి.
సాధారణంగా వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ఆకాశమంత పెళ్లి పందిరి వేసి.. భూదేవంతా అరుగు వేసి బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ మద్య పెళ్లిళ్లు చాలా చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. తమ పెళ్లి ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుంచుకోవాలని వినూత్నంగా జరుపుకుంటారు. ప్రీ వెడ్డింగ్ నుంచి వెడ్డింగ్ వరకు అన్నీ గ్రాండ్ గా వెరైటీగా జరుపుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా పెళ్లి కార్డులో వరుడు, వధువు పేర్లు ఉంటాయి. కానీ.. ఈ వెడ్డింగ్ కార్డులో వరుడు ఇద్దరు వధువుల పేర్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఒకే పెళ్లి మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. అయితే ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు అంకీకారం తెలపడం మరో విశేషం. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు. ఇతడు కోయజాతికి చెందిన యువకుడు. వీరికి ఓ వింతైన ఆచారం ఉంది.. పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించుకొని కొన్నాళ్లు కాపురం చేసి.. ఆ తర్వాత ఇరువురి అంగీకారంతో పెళ్లి చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే సత్తిబాబు స్వప్నను ప్రేమించాడు. ఆమెతో కొంత కాలంగా సహజీవనం చేశాడు. స్వప్న పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ దూరంగా ఉంటూ వచ్చారు.
ఆ తర్వాత సత్తి బాబుకి సునితతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మద్య ప్రేమ వ్యవహారం నడిచింది. సునిత కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. మొత్తానికి సత్తి బాబు పెళ్లి కాకుండానే తమ ఆచారం ప్రకారం ముందుగా కాపురం చేసి స్వప్న, సునిత లను తల్లులను చేశాడు. ఈ వ్యవహారం పెద్దలకు తెలిసిపోయింది. తాను ఇద్దరిని ప్రేమిస్తున్నానని చెప్పాడు.. సత్తిబాబుని కూడా ఆ ఇద్దరు అమ్మాలు కూడా ఇష్టపడి పెళ్లికి సిద్దమయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు సైతం ఇందుకు సమ్మతం తెలిపారు. ఈ నేపథ్యంలో వెడ్డింగ్ కార్డులో వరుడి పేరు సత్తి బాబు, వధువుల పేర్లు స్వప్న కుమారి, సునిత పేర్లు అచ్చు వేయించారు. ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కుటుంబ పెద్దల సాక్షిగా స్వప్న, సునితల మెడలో తాళి కట్టాడు సత్తిబాబు. పెళ్లికి ఇరువురు వధువుల కుటుంబ సభ్యులు హాజరై వధూవరులను దీవించారు. దీంతో సత్తిబాబు ఇద్దరు భామల ముద్దుల మొగుడిగా మారాడు.
పెళ్లి కాకుండానే ఇద్దరి మగువలను తల్లులను చేసి పెళ్లి చేసుకున్న సత్తిబాబు పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.. ఈ కాలంలో ఒక్కరిని మెయింటేన్ చేయాలంటేనే తలపానం తొకకు వస్తుంటే.. నువ్వు ఇద్దరిని చేసుకొని ఏం చేస్తావో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది నువ్వు సూపర్.. నువ్వు తోపురా స్వామీ అంటూ కామెంట్స్ చేశారు.. ఇక బ్యాచ్ లర్స్ మాత్రం మాకు ఒక్కరే దిక్కులేదు.. నీకు ఏకంగా ఇద్దరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.