నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపటం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపటం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరేందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని ఎంతో కష్టంగా సాగిస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటో కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ఏ పాపం తెలియని వారు బలవుతుంటారు. తాజాగా తెల్లాపూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిరుపేదలు ముగ్గురు బలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ పరిధిలో పటాన్ చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. హర్యానా నుంచి చిత్తూరు వెళ్తున్న బియ్యం లారీ.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అదుపుతప్పింది. లారీ ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి కింద ఉన్న గుడిసెలపై పడింది. దీంతో గుడెసెల్లో నివసిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతులు బాబురాథోడ్, కమలీబాయ్, రాథోడ్ లుగా గుర్తించారు. మరణించిన వారందరు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా రింగ్ రోడ్ పక్కన ఉన్న చెట్లకు నీరు పోసే వలస కూలీలని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్ -2 దగ్గర గురువారం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంతో నిరుపేదలు నివసించే ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. తెల్లవారుజామున నిద్రలో ఉన్న వారు.. నిద్రలోనే మృత్యువాత పడడంతో బాధితులు బోరుమంటున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉంటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఓవర్ డ్యూటీలు చేస్తూ నిద్రమత్తులో రోడ్డు ప్రమాదాలు చేసి.. తమ ప్రాణాలతో పాటు ఎందరో అమాయకుల ప్రాణాలను కొందరు డ్రైవర్లు బలి తీసుకుంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.