తెలుగు రాష్ట్రాల్లో వరంగల్ ఎంజీఎంలో రోగిపై ఎలుకలు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. నిన్న ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగి ని ఎలుకలు కొరికి వేయడంతో తీవ్ర రక్తస్రావంతో బాధపడ్డాడు. ఈ విషయంపై వైద్య సిబ్బందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై తెలంగాణ సర్కార్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ప్రతిపక్ష నేతలు ఈ ఘటనపై నిప్పులు చెరుగుతున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన రీతిలో ఆరోగ్య శాఖపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆరోగ్య శాఖ మంత్రి తీరును విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో ఎలుకలు తిరుగుతున్నప్పటికీ సిబ్బంది పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వరంగల్ ఎంజీఎంలో ఒక రోగిని కాపాడలేని మీరు రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు.. మీరు మంత్రిగా ఉన్న శాఖలో ఇంత దారుణం జరిగింది.. ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన ట్విట్ వైరల్ అవుతుంది.
ఆరోగ్య మంత్రి హరీష్ గారూ…
“కేసీఆర్ కిట్టీ”లో మీతో పాటు కుక్కలు, పిల్లులు,ఎలుకలు,బొద్దింకలు,నల్లులు, దోమలు చేరి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
“కేసీఆర్ కిట్”అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపి,ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించండి
పేదల పట్ల మానవత్వం ప్రదర్శించండి pic.twitter.com/QEhUFZkEo0
— Revanth Reddy (@revanth_anumula) April 1, 2022