బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. మరోవైపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు కూడా సెలవులిచ్చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి ఆ తరువాత వాయుగుండంగా మారనుంది. ఈ నేపధ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏయే జిల్లాలకు ఏ అలర్ట్ జారీ అయిందో, ఆ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఏ జిల్లాలకు ఏ అలర్ట్ జారీ
రానున్న 2-3 రోజుల్లో తెలంగాణలోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక అదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీమ్, జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అదే సమయంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు, ఈదురుగాలులు వీయనున్నాయి.
స్కూళ్లకు సెలవులు, ఎక్కడంటే
భారీ నుంచి అతి భారీ వర్షాల నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై రెడ్ అలర్ట్ ప్రకటించిన 5 జిల్లాల్లో అంటే హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవులిచ్చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్కూళ్లకు హాఫ్ డే స్కూళ్లు ప్రకటించారు. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలుండటంతో ఐటీ ఇతర ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే సౌకర్యం కల్పించింది.