వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల ఘటన మరవక ముందే కాకతీయ యూనివర్సిటీలోనూ మూషికాల సంచారం కలవరపెడుతోంది. లేడీస్ హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో ఎలుకలు సంచరిస్తున్నాయి.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల సంచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో తిరుగుతూ పలువురిని ఎలుకలు గాయపరిచాయి. ఆ ఘటన మరవక ముందే కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ మూషికాల సంచారం కలవరపెడుతోంది. అమ్మాయిల వసతి గృహంలో పెద్ద సంఖ్యలో ఎలుకలు సంచరిస్తున్నా.. సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినీలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హాస్టళ్లలో నిద్రిస్తున్న విద్యార్థుల కాళ్లు, చేతులు కొరకడంతో గాయాలయ్యాయి. కాకతీయ క్యాంపస్ లోని గర్ల్స్ హాస్టల్లో ఈ ఘటన కలకలం రేపుతోంది.
వరంగల్ కాకతీయ యునివర్సిటీలో ఎలుకల బీభత్సం సృష్టించాయి. లేడీ హాస్టల్లో నిద్రిస్తున్న అమ్మాయిల కాళ్లు , చేతులు కొరకడంతో పలువురికి గాయాలయ్యాయి. క్యాంపస్ లోని పద్మాక్షి వసతి గృహంలోని డి బ్లాక్ లోని రూమ్ నం.1లో ఇద్దరు విద్యార్థినీలపై ఎలుకలు దాడి చేశాయి. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చికిత్స కోసం విద్యార్థినిలను హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్ కనీస వసతులు లేవని ఎక్కడ చెత్త.. అక్కడే ఉంచుతున్నారని విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. ఈ చెత్త ఉండటంతో ఎలుకు, ఇతర విష పురుగులు వచ్చి చేరుతున్నాయని విద్యార్థినిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎలుకలు ముట్టిన ఆహారం తిని కొంత మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఇప్పుడు అదే వరంగల్ కేయూలో విద్యార్థినీలపై ఎలుకలు దాడి చేయడం ఆసక్తిగా మారింది.