బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఇటీవలే వివాదస్పద వ్యాఖ్యలు చేశారని ఆయనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనంకు వెళ్లిన రాజాసింగ్.. మీడియా ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఇటీవలే వివాదస్పద వ్యాఖ్యలు చేశారని ఆయనపై తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయినా రాజా సింగ్.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తనదైన శైలీలో బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా భారత దేశం హిందూ దేశం కావాలంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యనించారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వెళ్లిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రాజాసింగ్ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు స్వామివారి తీర్ధ ప్రసాదాలు రాజాసింగ్ కి అందజేశారు. ఆయన తన కుటుంబ సభ్యులు, మరికొందరు కార్యకర్తలతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. “నేను ఆ దేవుడిని కోరింది ఒక్కటే. అందరం బాగుండాలి. అలానే నా భారత దేశం.. హిందూ రాష్ట్రంగా కావాలి. భారత దేశంలో లవ్ జిహాద్ లాంటివి జరగకూడదని ఆ దేవుడిని ప్రార్థించాను. ఇక రాజకీయల గురించి మాట్లాడితే.. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. భారత దేశానికి నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉండాలని దేవుడ్ని కోరుకున్నాను. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ మోసపూరిత మాటలతో పరిపాలన సాగిస్తున్నారు.
బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారు. అలానే మద్యం తెలంగాణగా మార్చారు. ప్రజల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం వద్దు.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది” అని రాజాసింగ్ అన్నారు. మరి.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.