సాధారణంగా స్కూల్ వార్షికోత్సవాలు అంటే ఎంతో గ్రాండ్ గా చేస్తుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వార్షికోత్సవంలో తెగ సందడి చేస్తుంటారు. వివిధ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలతో జోష్ గా ఉంటుంది. పిల్లలు డ్యాన్సులు, పాటలతో అలరిస్తుంటారు.
ఇటీవల పాఠశాల వార్షికోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థులు స్టేజ్ పై పాటలు పాడటం, డ్యాన్సులు వేయడం, చిన్న చిన్న స్కిట్స్ తో అలరిస్తూ ఉంటారు. తాజాగా కీసర స్వామి నారాయణ గురుకుల్ పాఠశాల వార్షికోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఫైర్ డ్యాన్స్ చేస్తున్న సందర్భంలో పిల్లలపై మంట పడి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ విద్యార్థికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.
కీసర స్వామి నారాయణ గురుకుల్ పాఠశాల వార్షికోత్సవంలో ఓ వ్యక్తి ఫైర్ తో విన్యాసాలు చేశాడు. అది కాస్త మిస్ ఫైర్ అయి డ్యాన్స్ చేస్తున్న విద్యార్థులపై మంట పడటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ విద్యార్థికి తీవ్రంగా గాయాలు కావడంతో రహస్యంగా ఆసుపత్రిలో చికిత్స చేయించారు స్కూల్ యాజమాన్యం. స్టూడెంట్ తో ఫైర్ డ్యాన్స్ చేస్తున్న సందర్భంగా మిస్ ఫైర్ ఒక్కసారే మంటలుచెలరేగాయి. ఈ నెల 11 న ఈ సంఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులంతా ఒకరిపై ఒకరు నిలబడి ఉండగా ముందు వరసలో ఉన్న వ్యక్తి ఫైర్ తో విన్యాసాలు చేయడం మొదలు పెట్టాడు. హఠాత్తుగా ఆ మంటలు పిల్లలపై పడటంతో ఒక్కసారిగా పైన నిల్చున్న విద్యార్థులు కిందపడిపోయారు.
ఈ ఘటనలో ఒక విద్యార్థికి తీవ్రంగా గాయాలు కావడంతో విషయాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు స్కూల్ యాజమాన్యం. చిన్న పిల్లలతో ఫైర్ డ్యాన్స్ చేయించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని… ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లల కు దూరంగా ఇలాంటి ఫైర్ విన్యాసాలు చేయాలని కానీ.. ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.