తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. హైదరాబాద్ నగరం వచ్చే 30 ఏళ్లలో మరిన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని మంత్రి కేటీఆర్ ఓ సందర్భంలో అన్నారు. దీనికి అనుగుణంగా అన్ని వసతులతో పాటు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రపంచంలో క్రికెట్ ని అభిమానించేవారు మరింతగా పెరిగిపోతున్నారు. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం తరహాలో అన్ని వసతులు.. అధునాతన సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు రంగం సిద్దం చేయాలని మంత్రి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ అన్నిరంగాల్లో ముందంజలో ఉండేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇప్పటికే ఎన్నో విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మహానగరానికి మరింత వన్నె తెచ్చే విధంగా అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు శ్రీనివాస్ గౌడ్. ఉప్పల్ క్రికెట్ స్టేడియం మాదిరిగా అంతర్జతీయ స్థాయిలో అన్ని మౌలిక వసతులతో అందరూ మెచ్చుకునే స్థాయిలో అధునాతన క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.