సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఎప్పటికప్పుడు అపెడేటెడ్ గా ఉంటారు. ఎవరికైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడంలో ముందుంటారు.
సాధారణంగా సెలబ్రెటీలు, రాజకీయ నేతలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తమ ఫాలోయింగ్ పెంచుకుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ.. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఎప్పటికప్పుడు అపెడేటెడ్ గా ఉంటారు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్. ట్విట్టర్ వేదికగా రాజకీయాలే కాదు.. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుటారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నా అంటూ వారికి భరోసా ఇస్తూ తనకు చేతనైన సాయం చేస్తూ అండగా నిలుస్తుంటారు. తాజాగా ఓ మహిళ ప్రయాణికురాలు చేసిన ట్విట్ కి మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.. రాష్ట్రాభివృద్ది లో భాగంగా ప్రజల నుంచి ఆయన ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తీసుకోవడమే కాదు.. ఎవరికైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడంలో ముందుంటారు. ఈ క్రమంలో ఓ మహిళ ప్రయాణికురాలు తన కష్టాలు చెబుతూ కేటీఆర్ కి ట్విట్ చేసింది. ఆ ట్విట్ పై వెంటనే స్పందించారు మంత్రి కేటీఆర్. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ బయట రాత్రి 10 తర్వాత మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని.. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళలకు సురక్షితమైన రవాణా సౌకర్యం అందించాలని హర్షిత అనే మహిళ కేటీఆర్ కి ట్విట్ చేసింది.
హర్షిత ట్విట్ కి మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ట్రాకింగ్ వ్యవస్థను తీసుకు వచ్చి మహిళలకు సురక్షితమైన రవాణా ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు. అలాగే మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలిజేస్తూ మీ విలువైన సూచనను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం.. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా, మంత్రి కేటీఆర్ సూచనకు సానుకూలంగా స్పందించారు డీజీపీ అంజన్ కుమార్. రైల్వే, బస్టాండ్ వద్ద జీపీఎస్ ట్రాకింగ్ మెకానిజమ్ తో రాత్రి సమయంలో ఆటోలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు సురక్షిత ప్రయాణం చేసేలా తగిన రవాణా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
Request @TelanganaDGP to consider this at the earliest and institute such mechanism at all Railway and Bus stations across the state
Thank You Harshitha Garu for your suggestion https://t.co/KwBqJ1krXq
— KTR (@KTRBRS) March 10, 2023
👍 Thank You DGP Garu https://t.co/Ghg85WPu1D
— KTR (@KTRBRS) March 10, 2023