సినిమాల పిచ్చో లేదా సీరియళ్ల ప్రభావమో తెలియదు కానీ వెండితెరపై చూపించే సంఘటనలు నిజ జీవితంలో చోటుచేసుకోవడం మొదలయ్యాయి. వాటిని ఆదర్శంగా తీసుకొంటున్న కొందరు.. సభ్యసమాజం నవ్వుకునేలా చేస్తున్నారు. తాజగా, భద్రాద్రికి చెందిన ఓ యువకుడు సమాజాన్నే ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఇతడు ఏం చేశాడనుకుంటున్నారా..! ఒకే వేదికపై ఇద్దరిని మనవడనున్నాడు. మరికొన్ని నిమిషాల్లో ఆ పెళ్లి జరగనుంది.
సినిమాల పిచ్చో లేదా సీరియళ్ల ప్రభావమో తెలియదు కానీ వెండితెరపై చూపించే సంఘటనలు నిజ జీవితంలో చోటుచేసుకోవడం మొదలయ్యాయి. వాటిని ఆదర్శంగా తీసుకొంటున్న కొందరు.. సభ్యసమాజం నవ్వుకునేలా చేస్తున్నారు. తాజగా, భద్రాద్రికి చెందిన ఓ యువకుడు సమాజాన్నే ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. అది కూడా మహిళా దినోత్సవం రోజున ఇలాంటి ఘటన జరుగుతుండటం గమనార్హం. ఇంతకీ ఇతడు ఏం చేశాడనుకుంటున్నారా..! ఒకే వేదికపై ఇద్దరిని మనవడనున్నాడు. మరికొన్ని నిమిషాల్లో ఆ పెళ్లి జరగనుంది. ఇలాంటి ఘటనలు పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ఎన్నో వెలుగుచూసినా.. తెలుగు రాష్ట్రాలలో వెలుగుచూసిన మొదటిది మాత్రం ఇదే కావచ్చు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలోని కుర్నపల్లి గ్రామానికి చెందిన సత్తిబాబు.. ప్రేమ పేరుతో ఇద్దరి యువతుల(సునీత, స్వప్నకుమారి)ను బుట్టలో వేసుకున్నాడు. అనంతరం ఒకరికి తెలియకుండా మరొకరితో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ఆపై కొంతకాలానికి స్వప్నను పెళ్లి చేసుకోవాలనుకొని.. వారి పెద్దలతో మాట్లాడి ఒప్పించాడు. అందుకు వారు అంగీకరించడంతో వివాహ బంధానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న సునీత సత్తిబాబును నిలదీసింది. నాతో తిరిగి ఇప్పుడు ఆ అమ్మాయని చేసుకుంటావా అంటూ పంచాయితీ పెట్టించింది. అతడు ఒకే సమయంలో ఇద్దరితోనూ ప్రేమాయణం నడపడంతో పెద్దలకు కూడా ఏం తీర్పు ఇవ్వాలో అర్థం కాలేదు. మీరే తేల్చుకోవాలంటూ వారికే వదిలేశారు.
అతన్ని వదులుకునేందుకు ఇద్దరూ ససేమిరా అనడంతో సత్తిబాబు ఇద్దరితోనూ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. పెళ్లి చేసుకోకుండా ఏడాది క్రితమే ఆ ఇద్దరితోనూ కాపురం చేయటం మొదలుపెట్టాడు. పైగా వీరికి ఒక్కో సంతానం కూడా ఉన్నారు. ఇప్పుడు వీరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వాస్తవానికి కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. వీరు కూడా అదే సంప్రదాయాన్ని పాటించి, ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ మేరకు బంధుమిత్రులకు శుభలేఖలు పంపారు. ఆ శుభలేఖలో వరుడి పేరు, ఇద్దరు వధువుల పేర్ల ఉండటం గమనార్హం. వీరి పెళ్లి బుధవారం అనగా మార్చి 9వ తేదీ ఉదయం 7.04 గంటలకు జరగనుంది.అందుకు సంబంధించిన పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఒకే ముహూర్తానికి ఇద్దరిని మనవాడుతున్న ఒక్క మగాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పెళ్లిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.