కొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాము. ఈ క్రమంలో కొత్త సంవత్సరానికి స్వాగంత చెప్పేందుకు అందరూ ఇప్పటికే తమ ప్లాన్ లను సిద్ధం చేసుకున్నారు. ఇక మందుబాబుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోజు మందు తాగుతూ చికెన్ ముక్క తింటూ చిల్ అవుతుంటారు. అయితే వారిని మరింత చిల్ చేసేలా తెలంగాణ ప్రభుత్వం.. మందుబాబులకు ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు జరగనున్నట్లు కీలక ప్రకటన చేసింది. కేసీఆర్ సర్కార్ చేసిన ఈ ప్రకటనతో మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు. అలానే మందుబాబులు కూడా డిసెంబర్ 31న ఓ రేంజ్ లో ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. ముఖ్యంగా చుక్క, ముక్కతో ఆరోజును ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఆరోజున మద్యం దుకాణాల ముందు క్యూ కడతారు. అయితే.. సాధారణ రోజులు మాదిరిగానే త్వరగా మూసివేస్తారని ఆందోళన చెందుతుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం వారికి ఈ శుభవార్త చెప్పింది. బార్లు, పబ్బులు, మద్యం షాపుల సమయాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ సమయంలో మద్యం అమ్మకాలు నిల్చిపోయినందున లైసెన్స్ కల్గిన షాపు యాజమాన్యంకి, బార్ నిర్వాహకులకు మినహాయింపుగా ఈ మద్యం విక్రయాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యూయర్ వేడుకలతో రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలు జరుగనున్నాయి. అయితే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదు చేస్తామని పేర్కొంది ప్రభుత్వం. మరి.. మందు విక్రయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.