మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల నుండి ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరకు చాలా మంది ప్రముఖులు చదివిన స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇక ఈ సంవత్సరంతో ఈ స్కూల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా హెచ్ పీఎస్ స్కూల్ గురించి ప్రత్యేక కథనం మీకోసం.
”దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమై ఉంటుంది” అన్న మహానుభావుడి మాట అక్షరాల నిజం అని నిరూపిస్తూ.. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఈ స్కూల్ లో విలువలకు పెద్ద పీట వేస్తూనే.. ప్రపంచ విద్యా విధానాన్ని అనుసరిస్తోంది. ఇక ఈ స్కూల్ లో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థల్లో పనిచేస్తున్నారు. మరికొందరు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే 2023 సంవత్సరలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. 1923లో ప్రారంభించిన ఈ స్కూల్ ఎంతో మంది విద్యార్థులను ప్రపంచ స్థాయి లీడర్స్ గా తీర్చిదిద్దింది. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల నుండి ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరకు అంతా ఇక్కడ చదుకున్నవారే కావడం విశేషం. మరి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ స్కూల్ గురించి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తూ.. ఎంతో మంది విద్యార్ధులను ఉన్నత స్థానాల్లో నిలిపింది ఈ స్కూల్. ఈ స్కూల్ లో చదివిన విద్యార్థులు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎంలుగా, సీఈవోలుగా, రాజకీయ వేత్తలుగా, వ్యాపార వేత్తలుగా రాణించారు, రాణిస్తున్నారు. ఇక ఈ స్కూల్ లో చదివిన అజయ్ పాల్ సింగ్ బంగా వరల్డ్ బ్యాంక్ సీఈవోగా నామినేట్ అయిన విషయం మనకు తెలిసిందే. అతడితో పాటుగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, రాజకీయ నాయకులు అయిన మాజీ సీఎం కిరణ్ కుమార్, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా.. శంతన్ కుమార్ ఇక కొంత మంది ప్రముఖులు ఈ పాఠశాలలోనే చదుకుని గొప్పగొప్ప స్థానాల్లో నిలిచారు. ఇక ఈ పాఠశాల గతానికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. 1923లో జాగీర్దారీ వ్యవస్థ ఉన్న కాలంలో జాగీర్దార్ల పిల్లల కోసం ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ పాఠశాల పేరు జాగీర్దార్ కాలేజ్.
ఇక ప్రారంభించిన ఏడాది కేవలం 6 పిల్లలు మాత్రమే చేరారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను రద్దు చేసిన భారత ప్రభుత్వం.. 1951 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గా పేరు మార్చింది. అప్పటి నుంచి ఈ పాఠశాల రోజురోజుకు ఎదుగుతూ.. ప్రపంచ స్థాయి పాఠశాలగా అవతరించింది. ప్రస్తుతం ఈ స్కూల్ లో 3500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక 1980 వరకు అబ్బాయిలకు మాత్రామే ఇందులో చదువు చెప్పేవారు. ఆ తర్వాత నుంచి అమ్మాయిలకు కూడా చదువు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటికే ఈ స్కూల్ కు సంబంధించి 2050 ప్లాన్ ను కూడా సిద్ధం చేసినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పుకొచ్చారు. మరి సత్య నాదేళ్ల, అజయ్ బంగా, వైఎస్ జగన్, నాగార్జున, హర్ష భోగ్లే లాంటి వారు చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఈ సంవత్సరంలో 100 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.