తెలంగాణ ప్రభుత్వం సామన్యులకు సరైన న్యాయాన్ని అందించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ వ్యవస్థతో సామాన్యులకు పోలీసులకు మధ్య ఓ స్నేహపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దీంతో పోలీస్ వ్యవస్థ మరింత పటిష్టమవ్వడంతో పాటు సామాన్య ప్రజానికం ధైర్యంగా ఫిర్యాదులు అందజేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
నగరంలో ఆకతాయిల ఆగడాలను అరికట్టి సమస్యలను పరిష్కరించేందుకు వాట్సప్ నెంబర్ ను ప్రవేశపెట్టారు. అనునిత్యం హైదరాబాద్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, మీ సమస్యలకి పరిష్కారాలు & సూచనలు అందిస్తూ, మీరు పంపించే ఏ సమాచారం అయిన స్వీకరించి మీ వివరాలు గోప్యంగా ఉంచుతామంటోంది హైదరాబాద్ సిటీ పోలీసు. ఇక ఎలాంటి సమస్యలు ఉన్నా 9490616555 ఈ నెంబర్ కి వాట్సప్ చేయాలంటూ సూచిస్తున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
అనునిత్యం హైదరాబాద్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, మీ సమస్యలకి పరిష్కారాలు & సూచనలు అందిస్తూ, మీరు పంపించే ఏ సమాచారం అయిన స్వీకరించి మీ వివరాలు గోప్యంగా ఉంచుతూ
తోబుట్టువులా తోడుంటుంది, ఆప్త మిత్రుడిలా ఆదుకుంటుంది. అనునిత్యం ప్రజా సేవలో 9490616555హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సప్ నంబర్ pic.twitter.com/OuV1tkIBMy— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) March 26, 2022