కొన్ని రోజుల క్రితం అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. తాజాగా మరోసారి మాట్లాడారు.
కొన్ని రోజుల క్రితం అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల పిల్లవాణ్ని శునకాలు పొట్టన బెట్టుకున్న దృశ్యాలు అందర్నీ కంటతడి పెట్టించాయి. ప్రదీప్ అనే బాలుడు నడుచుకుంటూ వస్తుండగా కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచి బాలున్ని పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటనపై నగర మేయర్ విజయలక్ష్మి స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కలను నగరవాసులు దత్తత తీసుకోవాలంటూ మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. తాజాగా మహిళ దినోత్సవం భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ కుక్కల ఘటన గురించి మరోసారి మాట్లాడారు.
మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చాలా సమయం పాటు అక్కడి వచ్చిన మహిళలతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లోని మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేశారు. అలానే రాజకీయల్లో ఉంటే ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయో, వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కొవాళ్లో ఆమె తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..” మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకోవాల్సి ఉంది. అలానే చాలా నేర్చుకుంటున్నాను. ఇలా మనం కలుసుకున్న ప్రతి సారి నవ్వుకుంటూ సంతోషంగా ముచ్చటించుకుంటే బాగుంటది.
చాలా మంది రాజకీయాల్లో ఉండే మహిళలు ఉంటే ఓ రకమైన కామెంట్స్ చేస్తుంటారు. రాజకీయాల్లో ఉన్న మహిళ గురించి చెడుగా కామెంట్స్ చేస్తుంటారు. మన ముందు ఒకలా మాట్లాడి.. వెనుకాల మరొకలా మాట్లాడుతుంటారు. ఒక మహిళ బయటకు వచ్చిందంటే.. అది కొందరిలో ఓర్వలేని తనమో, ఇకేమో కానీ.. చెడుగా కామెంట్స్ చేస్తుంటారు. ఇవాళ ఓ ఆటో డ్రైవర్ నుంచి విమానాలు నడిపే స్థాయిలో మహిళలు ఎదిగారు. ఇలా అన్ని రంగాల్లో మిగిలిన వారికి పోటీ అవుతున్నామని కొందరు భావిస్తున్నారు. అయితే అలాంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలి.
మహిళ్లలో కొందరు ఒక అడుగు వెనక్కి వేయగానే తాము ఓడిపోయినట్లు బాధ పడిపోతారు. సిటీ మేయర్ గా ఉండే ముందుకు నడిపియాలంటే ఎన్నో బాధ్యతలు, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇటీవల జరిగిన కుక్క సంఘటన మీ అందరికి తెలుసు. ఆ కుక్క ఎవరినో కరిస్తే.. నేనే కరవమన్నట్లు కొందరు మాట్లాడారు. రాజకీయాల్లో ఉంటే ఇలాంటి వన్ని ధైర్యంగా ఎదుర్కొవాలి” అంటూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వ్యాఖ్యలు చేశారు. మరి.. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.