వరి ధాన్యం సేకరణ, కృష్ణా, గోదావరి నదీ జలాల్లో వాటాపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. హస్తినలో మూడో రోజు కూడా సీఎం కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. అయిన ఇంత వరకు ప్రధానితో సహా ఇతర కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్ లభించలేదు. సోమవారం కూడా దేశ రాజధానిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకే పరిమితమయ్యారు. కేసీఆర్ వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చారు. వీరికంటే ముందు రోజే ఢిల్లీ చేరుకున్న మంత్రి కేటీఆర్, ఇతర నేతలు సీఎంతోనే ఉన్నారు.
ప్రధానితో పాటు ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోరింది సీఎంఓ. అమెరికా వర్తక ప్రతినిధులతో మంత్రి షీయూష్ గోయోల్ బీజీగా ఉన్న అపాయింట్ మెంట్ ఇచ్చారని ప్రచారం జరిగింది.. కానీ ఎలాంటి స్పష్టత రాలేదు. మరొక కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రెండు రోజుల జోధాపూర్ పర్యటనలో ఉన్నారు.
ఇక ప్రధాని, కేంద్ర మంత్రులు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీడ నేడో.. రేపో అపాయింట్ మెంట్ వస్తుందిని సీఎంవో అధికారులు అంటున్నారు. కాగా ఢిల్లీలో ఉన్న రాష్ట్ర మంత్రులు, సీఎస్, ఆయా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ వివిధ అంశాలపై సమీక్ష చేసినట్టు సమాచారం. కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సుధాన్ష్ పాండేతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు.