తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు లోనవడంతో అందరూ టెన్షన్ పడ్డారు. వెంటనే ఆయనను వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారని, ఆయన ఎడమ చేయి లాగుతోందని చెబుతున్నారని వైద్యులు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు వైద్యులు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. ఎడమ చేయి నొప్పిగా ఉందన్నారని, అందుకే పరీక్షలు నిర్వహించి కరోనరీ యాంజియోగ్రామ్ చేశామని వైద్యులు తెలిపారు.
టెస్టులన్ని క్లియర్‌గా ఉన్నాయని.. వైద్యులు స్పష్టం చేశారు. అయితే నేడు సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆయన ఆనారోగ్యం కారణంగా ఆ పర్యటన రద్దయింది. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయి ప్రగతి భవన్‌కు వెళ్లారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించినట్లు తెలుస్తోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.