ప్రస్తుతం ఎక్కడ చూసినా విదేశీ సంస్కృతి రాజ్యమేలుతుంది. కళ్ళకు ఆకర్షణీయంగా కనబడుతుండడంతో చెడు చేసేదైనా కొంతమంది విష సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నారు. మద్యం, డ్రగ్స్, పబ్, వ్యభిచారం అంటూ లేని అలవాట్లను అలవాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కాల్ బాయ్ సంస్కృతి పెరిగిపోయింది.
విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ లో విష సంస్కృతి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతోంది. పాశ్చాత్య దేశ సంస్కృతి మోజులో పడి కొత్త కొత్త జబ్బులను అలవాటు చేసుకుంటోంది యువత. కాల్ గర్ల్స్ లా ఇప్పుడు కాల్ బాయ్స్ కల్చర్ పెరిగిపోతుంది. ఒకప్పుడు నగరంలో కొన్ని ప్రాంతాలు వేశ్యలకు అడ్డాగా ఉండేవి. ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవడంతో అవి ఇప్పుడు స్పా, మసాజ్ సెంటర్స్ ముసుగులో వెలిశాయి. కొంతమంది స్పా ముసుగులో హైటెక్ వ్యభిచారం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మగ వేశ్యలు తయారయ్యారు. కాల్ బాయ్స్ పేరుతో వ్యభిచారం చేస్తున్నారు. కాల్ బాయ్స్ సంస్కృతి హైదరాబాద్ లో బాగా పెరిగిపోయిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
కాల్ బాయ్స్ అంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంట్లో వాలిపోతారు. వేడి చల్లార్చి వెళ్ళిపోతారు. ఈ కాల్ బాయ్ సేవలను ఎక్కువగా సాఫ్ట్ వేర్ టెకీలు వినియోగించుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మహిళా టెకీలకు పెళ్లి పట్ల ఆసక్తి లేకపోవడం, ఒంటరిగా జీవించాలనుకోవడం వంటి కారణాల వల్ల లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు కాల్ బాయ్స్ సేవలను వినియోగించుకుంటున్నారు. పెళ్లి కాని అమ్మాయిలే కాదు పెళ్ళైన ఆడవారు కూడా ఈ కాల్ బాయ్ సేవలను వినియోగించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్ళైన కొన్నాళ్ళకు భర్తలు భార్యలను పట్టించుకోకపోవడం వల్ల.. మహిళలు తమ లైంగిక కోరికలను తీర్చుకోవడం కోసం మేల్ ఎస్కార్ట్ సేవలను కోరుకుంటున్నారు.
భర్తను కోల్పోయిన మహిళలు, పెళ్ళై శారీరక సుఖానికి దూరమైనవారు, పెళ్లి కాని వారు కాల్ బాయ్స్ ను బుక్ చేసుకుంటున్నారు. పైగా వివాహేతర సంబంధాల కంటే కాల్ బాయ్స్ సేవలు వినియోగించుకోవడం వల్ల ఈ వ్యవహారం రహస్యంగా ఉంటుందని కొంతమంది ఈ కాల్ బాయ్ సేవలను కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్ బాయ్ బిజినెస్ అంతా ఆన్ లైన్ లోనే జరుగుతోంది. వెబ్ సైట్, సోషల్ మీడియా, పలు యాప్స్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు కాల్ బాయ్ సర్వీసులను అందిస్తున్నారు. క్లయింట్ కోరిన సమయానికి, కోరిన ప్రదేశానికి బాయ్స్ ని పంపిస్తారు. ఆ సమయానికి, ఆ ప్రదేశానికి బాయ్స్ వెళ్తున్నారా లేదా అని వాట్సాప్ ద్వారా మానిటరింగ్ చేస్తారు. గంటకు రూ. 5 వేలు, రెండు గంటలకు రూ. 7 వేలు, డే మొత్తం ఉంటే రూ. 10 వేలు, నైట్ మొత్తం ఉంటే రూ. 12 వేలు వసూలు చేస్తున్నారు.
ఇక కొందరు ధనవంతులైన మహిళలు అయితే ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలను బుక్ చేసుకుని ఫామ్ హౌజ్ లకు వెళ్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ కాల్ బాయ్ జాబ్స్ కి ఎక్కువగా 19 నుంచి 25 ఏళ్ల వయసున్న యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. విలాసాలకు అలవాటు పడిన కొంతమంది యువకులు పార్ట్ టైం కాల్ బాయ్స్ గా చేస్తూ సుఖానికి సుఖం, డబ్బుకి డబ్బు పొందుతున్నారని తెలుస్తోంది. ఇది ఇలానే కొనసాగితే ఇది మరింత పెరిగి మన సంస్కృతిని నాశనం చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రహస్యంగా సాగుతున్న ఈ కాల్ బాయ్ వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరి ఈ విష సంస్కృతిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
