ఇటీవల కొంతమంది డబ్బు సంపాదన కోసం ఎన్ని ఘోరాలైనా చేయడానికి సిద్దపడుతున్నారు. ముఖ్యంగా హైటెక్ వ్యభిచారం తో విటులకు అమ్మాయిలను ఎరవేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.
ఈ మద్య కొంతమంది డబ్బు సంపాదన కోసం ఎన్నో అక్రమాలకు తెగబడుతున్నారు. చైన్ స్నాచింగ్, బెదిరింపులు, డ్రగ్స్ దందా చేస్తూ కోట్ల సంపాదిస్తున్నారు. ఇక ఈజీ మనీ కోసం వెంపర్లాడే కొంతమంది కిలాడీలు హైటెక్ వ్యభిచారం ముసుగులో విటులను ఆకర్షిస్తూ డబ్బుసంపాదనకు తెగబడుతున్నారు. ఇటీవల పెద్ద పెద్ద నగరాల్లో మసాజ్ సెంటర్ ముసుగులో హైటెక్ వ్యభిచారం నడిపిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. పోలీసులు ఎన్ని సార్లు రైడ్ చేసి పట్టుకున్నా వీరిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పొలీసులు. వివరాల్లోకి వెళితే..
గత కొంతకాలంగా మహానగరాల్లో డబ్బు సంపాదన కోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు కొంత మంది కేటుగాళ్ళు. మసాజ్ సెంట్లరు, బ్యూటీ పార్లర్లు, అపార్టుమెంట్స్ అద్దెకు తీసుకుకొని సోషల్ మాద్యమాలతో విటులను ఆకర్షించి గుట్టుగా హైటెక్ వ్యభిచారం సాగిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో వివిధ ప్రాంతాలనుండి మసాజ్ థెరపిస్టుల పేరిట అమ్మాయిలను తీసుకువచ్చి గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్నారు. హైటెక్ వ్యభిచారం సాగుతుందని పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసుల ఆయుష్ బ్యూటీస్ స్పా సెంటర్ , రుయాన్ స్పా సెంటర్ లపై నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు బంజారాహిల్స్ పోలీసులు. స్పా సెంటర్లో పనిచేసే యువతులను రెస్క్యూ హోం కు తరలించారు.
ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్లు అమ్మాయిలకు, మహిళలకు డబ్బు ఆశ చూపిస్తూ వారిని వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. ఒక్కసారి వీళ్ల ట్రాప్ లో పడిపోయిన వాళ్లను పదే పదే బెదిరిస్తూ వ్యభిచారం చేయిస్తున్నారు. వీరికి కొంతమంది పోలీసులు కూడా వత్తాసు పలకడంతో దందా బాగా సాగుతుంది. ముఖ్యంగా సోషల్ మాధ్యమాల్లో అమ్మాయిల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్నారు. బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్ ముసుగులో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు రైడ్ చేసి పట్టుకున్నా ఇలాంటి వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు.