బస్సు ప్రియాణికులకు ఆర్టీసీ అధికారులు మరో షాక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోవటంతో మళ్లీ బస్సు ఛార్జీలు పెంచే దిశగా అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా దెబ్బతో కుదేలైన టీఎస్ ఆర్టీసీని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కొత్త ప్రణాళికలను రూపొందించబోతుందని స్పష్టంగా అర్ధమవుతోంది.
ఇక ఈ క్రమంలోనే ఆర్టీసీకి కొత్త చైర్మన్, ఎండీని కూడా నియమించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా వ్యవస్థను గాడిలో పెట్టి నష్టాలను ఎలాగైన భర్తీ చేసేందుకు అధికారులు తెర వెనుక మంతనాలు జరుపుతున్నారు. ఇక విషయం ఏంటంటే..? ఏడాదిన్నర కాలంలోనే ఆర్టీసీ అప్పు 2021 జూన్ 21 నాటికి రూ. 6వేల 115 కోట్లుగా తేల్చారు టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు.
ఈ విధమైన నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించాలంటే ఖచ్చితంగా ఛార్జీలు పెంచక తప్పదనే ఆలోచనలో ఉన్నారు సంస్థ ఉన్నతాధికారులు. ఇక మొత్తానికి పెంపులో భాగంగా 20-30% మేర ఛార్జీలు పెంచే పెంచబోతున్నారు. ఇక మళ్లీ గనుక బస్సు ఛార్జీలు పెంచితే బస్సు ప్రియాణికుల నెత్తిన మరో భారం పడనుందని ప్రయాణికులు తమ గోడును వెళ్లబోస్తున్నారు. ఇక బస్సు ఛార్జీల పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.