కుక్కల దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిహారంతో పాటు కార్పోరేటర్లు తమ నెల రోజుల వేతనం విరాళంగా ఇవ్వాలని తీర్మానించారు.
అంబర్‌పేట్ కుక్కల దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. బాలుడికి పరిహారం ప్రకటించే విషయంపై హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగానే.. జీహెచ్‌ఎంసీ రూ.8 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. అలాగే, బాలుడి కుటుంబానికి తమ నెల రోజుల వేతనం విరాళంగా ఇవ్వాలని కార్పోరేటర్లు తీర్మానించారు.
కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ కుటుంబానికి పరిహారం ప్రకటించాలని గత కొద్దిరోజులుగా పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తోన్నాయి. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్లే ప్రదీప్ చనిపోయాడని, కుక్కలను కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమయ్యింది. బాలుడి కుటుంబానికి రూ.8 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ప్రకటించారు. అలాగే, తాము కూడా నెల రోజుల వేతనం పరిహారంగా ఇస్తామని కార్పొరేటర్లు అందరూ ముందుకొచ్చారు. కాగా, వీధి కుక్కల దాడిలో మృతి చెందిన ప్రదీప్ కుటుంబానికి పరిహారం ప్రకటించాలని డిమాండ్లు వస్తున్న క్రమంలో జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.