కుక్కల దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిహారంతో పాటు కార్పోరేటర్లు తమ నెల రోజుల వేతనం విరాళంగా ఇవ్వాలని తీర్మానించారు.
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ బడ్జెట్ నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ భేటీ అయింది. ఈ భేటీ టీఆర్‌ఎస్-బీజేపీ నేతల మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. పలువురు కార్పొరేటర్లు ప్రజా సమస్యలను ఏకరువు పెట్టడంతో గొడవ మొదలైంది. బీజేపీ వాళ్లకు వరికి, గోధుమలకు తేడా తెలియదని టీఆర్‌ఎస్ నేతలు అన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ కవిత చేసిన కామెంట్లపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. అభివృద్ధి గురించి చర్చించకుండా సమావేశాన్ని తప్పుదోవ […]