GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ బడ్జెట్ నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ భేటీ అయింది. ఈ భేటీ టీఆర్‌ఎస్-బీజేపీ నేతల మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. పలువురు కార్పొరేటర్లు ప్రజా సమస్యలను ఏకరువు పెట్టడంతో గొడవ మొదలైంది. బీజేపీ వాళ్లకు వరికి, గోధుమలకు తేడా తెలియదని టీఆర్‌ఎస్ నేతలు అన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ కవిత చేసిన కామెంట్లపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు.
అభివృద్ధి గురించి చర్చించకుండా సమావేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు గుంపుగా ఒకే చోట మూగారు. స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మేయర్ స్పందించారు. టీఆర్‌ఎస్ కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని అన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 14 ఏళ్లకే ప్రేమలో పడ్డ కూతురు! ప్రియుడి కోసం ఏకంగా..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.