గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ప్రజలు దేశావ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఎక్కడిక్కడ ఆందోళనలు, ధర్నాలు చేస్తూ.. తమ గళాన్ని విపిస్తున్నారు. ఇలాంటి సమయాన తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే, గ్యాస్ ధర మరింత పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకోసం.. ఢిల్లీకి రావడానికైనా తాము సిద్ధమని ఆమె వ్యాఖ్యానించారు.
రెండ్రోజుల క్రితం వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధర రూ. 50 రూపాయలు పెరగగా, 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 350.50 రూపాయలు పెరిగింది. ఈ ధరలు మార్చి ఒకటి నుండి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డొమెస్టిక్ సిలిండర్ ధర 1155 రూపాయలకు చేరింది. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతుంటే..ఇప్పుడు గ్యాస్ ధరల పెంపు మరింత భారమవుతుందని ప్రజలు దేశావ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోపెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.
గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలంగాణలో బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతూ.. బీఆర్ఎస్ నేతలంతా ఎక్కడికక్కడ నిరసన తెలిజేస్తున్నారు. గల్లీ లీడర్ల నుంచి మంత్రుల వరకు.. అందరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ.. కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే.. ఢిల్లీలో కూడా తమ నిరసన గళం వినిపిస్తామంటున్నారు. ఈ క్రమంలో అదే బీఆర్ఎస్‌ను చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పొరపాటున నోరుజారారు. గ్యాస్ ధరలను ఎట్టిపరిస్థితుల్లో పెంచాల్సిందే తన గళం వినిపించారు. అంతేకాదు.. ఆమెతో కలిసి నిరసనలో పాల్గొన్న మహిళలు కూడా అదే కోరుతున్నారంటూ..” ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.
ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలో గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగిస్తూ.. గ్యాస్ ధరలను ఎట్టిపరిస్థితుల్లో పెంచాల్సిందే అని డిమాండ్ చేశారు. ” ఇవాళ ఆలేరు పట్టణంలో తాము నిరసన కార్యక్రమం చేస్తున్నామని తెలియగానే.. మహిళలంతా స్వచ్ఛందంగా ఇందులో పాల్గొన్నారు. గ్యాస్ ధర పెంచాల్సిందే మేడం.. ఇందుకోసం ఎక్కడి వరకైనా పోదాం.. కావాలంటే రైలెక్కి ఢిల్లీకి కూడా పోదామన్నారు. ఈరోజు మహిళల్లో మంచి చైతన్యం ఉంది. తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోదీ. ఈరోజు వంట గ్యాస్ ధరలు పెంచేవరకు పోరాటం కొనసాగిస్తాం..” అంటూ గొంగడి సునీత ప్రసంగించారు. గొంగడి సునీత వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 4, 2023