అందరూ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతున్నారు. కాకపోతే మార్కెట్ లో రోజుకొక కొత్త కంపెనీ ఒక ఫోన్ విడుదలవుతోంది. వాటిలో ఏ ఫోన్ కొనుగోలు చేయాలి అనేది వినియోగదారులకు క్లారిటీ ఉండే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది.
ఫీచర్ ఫోన్స్ లో మోటరోలా ఒక మంచి బ్రాండ్ అందరికీ తెలుసు. ఆ బ్రాండ్ ఫోన్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ, స్మార్ట్ యుగంలో మోటో కంపెనీ కాస్త వెనుకపడింది. ఆండ్రాయిండ్, స్మార్ట్ ఫోన్ల తయారీలో వేగం పుంజుకునేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకోవటంలో పోటీలో వెనక్కు వెళ్లారు. కానీ, పుంజుకుని ఇప్పుడు మంచి మంచి మోడల్స్, ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మోటో జీ73 5జీ మొబైల్ ఇండియాలో లాంఛ్ అయింది. అదిరిపోయే ఫీచర్లు, అంతకన్నా అదిరిపోయే బడ్జెట్ ధరలోనే ఈ మోటో జీ73 5జీ ఫోన్ ని భారత విపణిలో ప్రవేశపెట్టారు.
మోటరోల కంపెనీ ఫోన్లు వాడే ప్రతిఒక్కరికి సుపరిచితమే. కాకపోతే ఆండ్రాయిడ్ యుగంలో వాళ్ల కాస్త నెమ్మదించడంతో స్మార్ట్ ఫోన్ల తయారీలో వెనుకపడ్డారు. కానీ, ఇప్పుడు తిరిగి పుంజుకుని మంచి మంచి మోడల్స్, ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నారు. అందులోనూ ధరను మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పుడు మోటో జీ73 5జీ స్మార్ట్ ఫోన్ ని ఇండియాలో లాంఛ్ చేశారు. ఈ ఫోన్ బ్లూ- వైట్ అనే రెండు కలర్ వేరియంట్స్ లో వస్తోంది. ఈ ఫోన్ మీడియోటెక్ డైమెన్సిటీ 930 చిప్ సెట్ తో ఇండియాలో వస్తన్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ లభిస్తోంది.
Moto G73 5G launched for Rs 18,999
Limited period offer price – Rs 16,999
First sale date – March 16#Motorola #motoG73 pic.twitter.com/5bjy9sWKDW— Anvin (@ZionsAnvin) March 10, 2023
ఇంక ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.5 ఇంచెస్ హోల్ స్క్రీన్, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన హెచ్ డీ+ స్క్రీన్ రెజల్యూషన్ తో లభిస్తోంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అంతేకాకుండా 30 వాట్స్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఇందులో కెమెరాల విషయానికి వస్తే.. పిక్సెల్ టెక్నాలజీ కలిగిన 50 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తోంది. ఇంక 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. దీనిలో పోట్రెయిట్, హెచ్ డీఆర్, డ్యూయల్ క్యాప్చర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మోటరోలా జీ73 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13తో వస్తోంది. తర్వాత ఆండ్రాయిడ్ 14కి అప్ డేట్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ ని ఇస్తారు. ఇంక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. రూ.18,999గా నిర్ణయించారు. మార్చి 16 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తారు. ఫ్లిప్ కార్ట్, మోటరోలా అధికారిక వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయచ్చు. లాంఛింగ్ ఆఫర్ కింది మరో రూ.2 వేలు అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. అంటే ఈ ఫోన్ రూ.16,999కే లభిస్తుంది.
Today, I’m giving away the newly launched #motog73 5G to the #stufflistingsarmy 😍
To win:
1. QRT using #motog73 #winmotog73 #stufflistingsarmy
2. Answer some questions
3. Like this tweet
Happy winning ❤ pic.twitter.com/NZsZg3QlvY— Mukul Sharma (@stufflistings) March 10, 2023